ETV Bharat / bharat

దివ్యాంగురాలి ఆకాంక్ష.. దిగొచ్చిన క్లాస్​ రూం!

Cerebral palsy girl in Kerala: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి.. చదువుకోవాలనే కోరికను తీర్చారు పాఠశాల సిబ్బంది. ఆమె కోసం రెండో అంతస్తులో ఉండే తరగతి గదిని గ్రౌండ్​ ఫ్లోర్​కు మార్చారు. పాఠశాలకు చిన్నారి వచ్చిన తొలి రోజును ఓ వేడుకలా నిర్వహించి చదువుకోవాలనే తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

cerebral palsy girl in Kerala
దివ్యాంగురాలి కోరికకు.. దిగివచ్చిన క్లాస్​ రూం!
author img

By

Published : Feb 25, 2022, 3:56 PM IST

Cerebral palsy girl in Kerala: కేరళ ఇడుక్కిలోని కల్లార్​లో సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పాఠశాలకు వచ్చి చదువుకోవాలనే కలను సాకారం చేశారు సిబ్బంది. అంతేగాకుండా ఆమెకు ఎప్పటికీ గుర్తుండేలా తొలిరోజున అపూర్వ స్వాగతం పలికారు సహ విద్యార్థులు. ఆ బాలిక రాక కోసం తరగతి గదిని అందంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల బెలూన్లతో క్లాస్​ రూంను అలంకరించారు. దివ్యాంగురాలైనా కానీ.. చదువుకోవాలనే తన కోరికకు మరింత బలం చేకూర్చేలా ప్రతి ఒక్కరు చిన్నారి సెరాకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. స్కూల్​ సిబ్బంది కూడా తమ వంతుగా ఆ బాలిక చదువుకోవాలనే సంకల్పానికి కట్టుబడి.. వీల్ ఛైర్ వచ్చేందుకు వీలుగా రెండో అంతస్తులో ఉన్న తరగతి గదిని గ్రౌండ్​ ఫ్లోర్​కి మార్చారు.

కోరిక మేరకు..

బాల్యం నుంచే చిన్నారి సెరా సెరెబ్రల్ పాల్సీతో బాధపడుతోంది. దీంతో పాఠశాల చదువుకు ఐదేళ్ల పాటు దూరం కావాల్సి వచ్చింది. అందరు పిల్లల లాగే తనకూ బడికి వెళ్లి చదువుకోవాలని ఉందనే కోరికను తన అమ్మానాన్నల ముందు ఉంచింది సెరా. కూతురు కోరిక మేరకు ఆమె తల్లిదండ్రులు కల్లార్​లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి సిబ్బందిని కలిసి విషయం చెప్పారు. ఇందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. చిన్నారి క్లాస్​ లోకి వెళ్లేందుకు సులభంగా ఉండేలా ఆరో తరగతి గదిని రెండో అంతస్తు నుంచి గ్రౌండ్​ ఫ్లోర్​కు మార్చారు. వీల్​ ఛైర్​ వచ్చేందుకు వీలుగా రోప్​ ఏర్పాటు చేశారు.

వేడుకగా..

చిన్నారి సెరా పాఠశాలకు వచ్చిన తొలి రోజును వేడుకలా నిర్వహించారు సిబ్బంది. తోటి విద్యార్థులు ఆమెకు పుష్పగుచ్ఛాలు, బహుమతులు ఇచ్చారు. అంతేగాకుండా ఆమెతో కేక్​ కట్​ చేయించారు.

ఇదీ చూడండి:

తండ్రి బిర్యానీ తీసుకురాలేదని.. కొడుకు ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.