ETV Bharat / bharat

'విచారణ పూర్తి కాకముందే గోవుల జప్తా?' - FARMERS

జంతువులను తరలించే వారు దోషులుగా తేలక ముందే వారి నుంచి గోవులను జప్తు చేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. 2017లో నోటిఫై చేసిన నిబంధనలను ఉపసంహరించుకోవడమో, లేదా సవరించడమో చేయాలని కేంద్రానికి సూచించింది. జంతువులు ఎంతోమందికి జీవనాధారం అని పేర్కొంది.

SC asks Centre to withdraw or amend 2017 rules on confiscating animals during trial
సుప్రీంకోర్టు
author img

By

Published : Jan 4, 2021, 4:02 PM IST

Updated : Jan 4, 2021, 5:08 PM IST

జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టానికి సంబంధించి 2017లో నోటిఫై చేసిన నిబంధనలు ఉపసంహరించుకోవాలని లేదా మార్పులు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. జంతువులను తరలిస్తూ పట్టుబడ్డవారు విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే గోవులను గోశాలలకు తరలించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. కొందరికి జంతువులే జీవనోపాధి అని పేర్కొంది. దోషిగా తేలక ముందే నిందితుల నుంచి జంతువులను ప్రభుత్వం జప్తు చేయకూడదని పేర్కొంది.

ఒకవేళ కేంద్రం 2017లో నోటిఫై చేసిన నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యాపారులు, నిందితుల నుంచి గోవులను జప్తు చేయడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

ఈ కేసులో కేంద్రం తరఫున వాదనలు వినిపించారు సోలిసిటర్​ జనరల్​ జయంత్ కే సూద్​. జంతువులను చంపుతున్నందునే 2017లో నిబంధనలు నోటిఫై చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.

అయితే జంతువులు ఎంతో మంది జీవనోపాధికి మూలం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పెంపుడు శునకాలు, పిల్లుల గురించి తాము మాట్లాడటం లేదని పేర్కొంది. జంతువులపై ఆధారపడే కొందరు జీవిస్తారని చెప్పింది. 2017లో నోటిఫై చేసిన నిబంధనలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంది. దోషిగా తేలే వరకు ఎవరి నుంచి జంతువులను జప్తు చేయొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.

అసలు కేసు ఏంటి?

2017లో కేంద్రం నోటిఫై చేసిన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని బఫెలో ట్రేడర్స్ వెల్ఫేర్​ అసోసియేషన్​ సుప్రీంకోర్టులో సవాల్​ చేసింది. వ్యాపారుల నుంచి గోవులను బలవంతంగా గోశాలలకు పంపడం వల్ల నష్టపోతున్నామని పేర్కొంది. ఇది ఎంతో మంది జీవనోపాధిని దెబ్బతీస్తోందని తెలిపింది. గోవుల విషయంలో కొంత మంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బఫెలో ట్రేడర్స్ అసోసియేషన్​ కోర్టుకు తెలిపింది.

ఈ పిటిషన్​పై స్పందన తెలపాలని 2019, జులై 2న కేంద్రాన్ని కోరింది సుప్రీంకోర్టు. గతేడాది ఆగస్టు 17న కూడా దీనిపై విచారణ జరిగింది.

ఇదీ చూడండి: జాక్​ మా ఎక్కడ?.. 2 నెలలుగా బిలియనీర్ అదృశ్యం

Last Updated : Jan 4, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.