ETV Bharat / bharat

'సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్​పై పూర్తి వివరాలివ్వండి'

author img

By

Published : Nov 26, 2020, 8:07 AM IST

సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్​కు దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. శాశ్వత కమిషన్​ మంజూరు ప్రక్రియ ముగిసిందని కేంద్రం తెలిపిన క్రమంలో పలువురు ఎంపిక కాని అధికారిణులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరి ప్రస్తుత స్థితిని తెలపాలని కోరింది.

Supreme court
సుప్రీం కోర్టు

భారత సైన్యంలో షార్ట్​ సర్వీస్​ కమిషన్​(ఎస్​ఎస్​సీ) కింద పనిచేస్తోన్న 615 మంది మహిళా అధికారిణుల వ్యక్తిగత స్థితిని తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అందులో 422 మంది శాశ్వత కమిషన్​కు అర్హత సాధించారు. సైన్యంలో మహిళా అధికారులను శాశ్వత కమిషన్​కు ఎంపిక చేసే​ఎంపిక ప్రక్రియ ముగిసిందని, ఫలితాలు ప్రకటించామని కేంద్రం తెలియజేసిన క్రమంలో ఈ మేరకు ఆదేశించింది సుప్రీం కోర్టు.

మహిళా కమిషన్​కు ఎంపిక కాని పలువురు అధికారిణులు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది.. జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఇందూ మల్హోత్రా, జస్టిస్​ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం. ఈ సందర్భంగా శాశ్వత కమిషన్​కు దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరి వివరాలు అందించాలని ఆదేశించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది పీఎస్​ పట్వాలియా వాదనలు వినిపించారు. తమ క్లైయింట్లలో ఒకరు 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నప్పటికీ శాశ్వత కమిషన్​ ఇవ్వలేదని తెలిపారు. ఈ పిటిషన్​ విచారణను వాయిదా వేస్తే.. అప్పటిలోపు సదరు అధికారిణి పదవి విరమణ పొందుతారని సూచించారు. మరో క్లయింట్​.. ఇంజినీరింగ్​ పూర్తి చేసినప్పటికీ.. ఆమెను శాశ్వత కమిషన్​కు ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే.. కేంద్రం వివరణ తెలుసుకోకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. 615 మందిలో కేవలం 277 మందికే శాశ్వత కమిషన్​ కల్పించినట్లు వార్తలు వచ్చినట్లు ధర్మాసనానికి తెలిపారు సీనియర్​ న్యాయవాది మీనాక్షి లేఖీ.

తమ అఫిడవిట్​ దాదాపుగా తయారైందని, త్వరలోనే కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు కేంద్రం తరఫున హాజరైన న్యాయవాది.

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబర్​కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ఈవీఎంలు వాడొద్దంటూ సుప్రీంలో పిటిషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.