ETV Bharat / bharat

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి

author img

By

Published : Mar 2, 2022, 6:01 PM IST

Russia Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మరవకముందే మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన మరో విద్యార్థి అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Ukraine Crisis
ఉక్రెయిన్‌ యుద్ధం

Russia Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన నవీన్‌ మృతిచెందిన ఘటన మరవకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన మరో విద్యార్థి అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Russia Ukraine war
ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి

పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతానికి చెందిన చందన్‌ జిందాల్‌(22) ఉక్రెయిన్‌లోని విన్నీసియాలో మోమోరియల్ మెడికల్‌ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ఫిబ్రవరి 2న చందన్‌ అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. అతడిని చూసేందుకు భారత్‌ నుంచి చందన్‌ తల్లిదండ్రులు ఫిబ్రవరి 7న ఉక్రెయిన్‌ వెళ్లారు. బ్రెయిన్‌ స్ట్రోక్ రాగా శస్త్రచికిత్స కూడా చేశారు. అయితే ఆరోగ్యం విషమించి మంగళవారం రాత్రి చందన్‌ మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో మంగళవారం రష్యా జరిపిన ఫిరంగి దాడిలో కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. సుమారు 30 మంది భారతీయ విద్యార్థులతో ఖర్కివ్‌లోని ఓ బంకరులో తలదాచుకున్న నవీన్‌ ఆహార పదార్థాల కోసం వెలుపలకు వచ్చినప్పుడు ఫిరంగి దాడిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.