ETV Bharat / bharat

'ఆస్తులు ధ్వంసం చేయడం స్వేచ్ఛ కాదు' - కేరళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

శాసనసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించి, ఆస్తుల ధ్వంసానికి పాల్పడటంపై మండిపడింది సుప్రీం కోర్టు. ఆస్తులు ధ్వంసం చేయటం స్వేచ్ఛ కాదని స్పష్టం చేసింది. 2015లో కేరళ శాసనసభలో అనుచితంగా ప్రవర్తించిన ఎల్​డీఎఫ్​ కూటమికి చెందిన శాసనసభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Jul 28, 2021, 4:40 PM IST

2015లో కేరళ శాసనసభలో అనుచితంగా ప్రవర్తించి, ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన కేసులో ఎల్‌డీఎఫ్‌ కూటమికి చెందిన శాసనసభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను రద్దు చేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వాక్‌ స్వాతంత్ర్యం కాదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

" ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజ్యాంగంపై విశ్వాసం కలిగివుండాలి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలను వాక్‌ స్వాతంత్ర్యంగా పేర్కొనకూడదు. చట్టసభ్యుల హక్కులు.. చట్టాల నుంచి మినహాయింపు పొందేందుకు ద్వారాలు కాకూడదు" అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం చేసిన అప్పీల్‌లో ఎలాంటి అర్హత లేదని వెల్లడించింది. సభలో అనుచిత ప్రవర్తన, హింసాత్మక చర్యలు చట్టసభ్యులు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ కేసులో వారంతా విచారణ ఎదుర్కోవాలని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఏం జరిగింది?

2015 మార్చి 13న కేరళ అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ సభ్యులు కొందరు అప్పటి ఆర్థిక మంత్రి కె.ఎం.మణి బడ్జెట్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో అనుచితంగా ప్రవర్తించారు. సభాపతి కుర్చీని ధ్వంసం చేయడంతో పాటు ప్రిసైడింగ్‌ అధికారి డెస్క్‌పై ఉన్న కంప్యూటర్‌, మైక్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను విరగ్గొట్టారు. దీంతో ఆరుగురు ఎల్‌డీఎఫ్‌ శాసనసభ్యులపై కేసు నమోదైంది.

అయితే ఈ కేసులను రద్దు చేయాలంటూ కేరళ ప్రభుత్వం ఆ మధ్య హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఊరట లభించలేదు.

ఇదీ చూడండి: ఆమె కోసం తెలుగులోనే జస్టిస్ రమణ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.