Nagpur Recce Case: నాగ్‌పుర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం రెక్కీ కేసులో నలుగురు ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం సంస్థ అయిన జైషే మహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల రెక్కీ నిర్వహించినట్లు నాగ్‌పుర్ పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.
అతడు ఇచ్చిన సమాచారంతో..
నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంతో పాటు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు నాగ్‌పుర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేయగా.. నాగ్‌పుర్‌లో రెక్కీ విషయం తెలిసిందని వివరించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు మరో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారని వెల్లడించారు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు అమితేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నాగ్‌పుర్‌లో జైషే మహ్మద్ రెక్కీ .. నగరంలో హై అలర్ట్!