Road cracks after smashing coconut: ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన భాజపా ఎమ్మెల్యే సుచి చౌధరికి వింత అనుభవం ఎదురైంది. నూతనంగా నిర్మించిన రోడ్డుమార్గాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమె.. కొబ్బరికాయ కొట్టగానే రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. దీంతో రోడ్డు నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి.
MLA Suchi chaudhary Road Coconut:
రూ. కోటి 16 లక్షలు వెచ్చించి ఖేడా గ్రామంలో ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే సుచి.. రోడ్డును ప్రారంభించేందుకు వచ్చారు. సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. కొబ్బరికాయ పగలకపోగా.. రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త మౌసమ్ చౌధరి అక్కడే ఉన్నారు. ఆయన ఓ పార తీసుకొని తవ్వగా.. రోడ్డు మొత్తం విచ్ఛిన్నమైపోయింది.
-
The MLA says she waited on the spot for 3 hours for a team of officers to arrive and take samples of the road to investigate. She has promised strict action against those responsible for construction of the road at a cost of ₹ 1.16 crore. pic.twitter.com/GiEWeVXEV0
— Subodh Kumar (@kumarsubodh_) December 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The MLA says she waited on the spot for 3 hours for a team of officers to arrive and take samples of the road to investigate. She has promised strict action against those responsible for construction of the road at a cost of ₹ 1.16 crore. pic.twitter.com/GiEWeVXEV0
— Subodh Kumar (@kumarsubodh_) December 3, 2021The MLA says she waited on the spot for 3 hours for a team of officers to arrive and take samples of the road to investigate. She has promised strict action against those responsible for construction of the road at a cost of ₹ 1.16 crore. pic.twitter.com/GiEWeVXEV0
— Subodh Kumar (@kumarsubodh_) December 3, 2021
MLA Suchi chaudhary Khera road opening:
దీంతో ఎమ్మెల్యే సుచి చౌధరి.. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం రోడ్డు వేసిన గుత్తేదార్లపై మండిపడ్డారు. అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించి.. అధికారులకు చీవాట్లు పెట్టారు.
ఈ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వికాస్ అగర్వాల్ స్పందించారు. రోడ్డు నమూనాలను సేకరించినట్లు చెప్పారు. వీటిని పరిశీలన నిమిత్తం పంపినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'మాయా బావి' గుట్టు తేల్చే పనిలో పరిశోధకులు