ETV Bharat / bharat

టీకా కోసం వారికి​ రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

author img

By

Published : Apr 25, 2021, 5:39 PM IST

కరోనా టీకా కోసం కొవిన్ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కానుంది. మే 1 నుంచి 18-45 ఏళ్ల వారికి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుండగా.. వీరంతా తప్పనిసరిగా కొవిన్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. టీకా కేంద్రాల వద్ద తాకిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

VACCINE-ONLINE-REGISTRATION
టీకా పొందాలంటే వారికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

మే1 నుంచి 18-45 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా పంపిణీ ప్రారంభం కానున్న వేళ.. నూతన నిబంధన తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా టీకా పొందేందుకు 18-45 మధ్య వయసు వారు తప్పనిసరిగా కొవిన్‌ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశాయి. నేరుగా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ పొందాలనుకునే వారికి... టీకా వేయబోమని తేల్చి చెప్పాయి. అయితే, 45 ఏళ్లు పైబడిన వారు టీకా కేంద్రాల వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని స్పష్టం చేశాయి.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, జనం తాకిడిని తగ్గించేందుకు రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తున్నామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్లను ఈ నెల 28న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొవిన్‌ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- కో-విన్​తో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొందడమెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.