ETV Bharat / bharat

మతకలహాలకు ఐఎస్​ఐ​ కుట్ర.. ఆ రాష్ట్రంలో రెడ్​ అలర్ట్​

అసోంలో మతకలహాలు సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్​ అలర్ట్​ ప్రకటించడం సహా అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.

terror attacks in assam
మతకలహాలకు కుట్ర!.. రాష్ట్రవ్యాప్తంగా రెడ్​ అలెర్ట్​
author img

By

Published : Oct 18, 2021, 10:03 AM IST

Updated : Oct 18, 2021, 10:17 AM IST

అసోంలో మతకలహాలు సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ ఆల్​ఖైదాతో కలిసి పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల సమాచారం. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్ర పోలీసులు రెడ్​ అలర్ట్​ను ప్రకటించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అధికారులకు శనివారం భద్రతాదళాలు సమాచారాన్ని అందించాయి. అవాంఛిత ఘటనలు అడ్డుకోవాలని ఆదేశించాయి.

గువాహటిలో ఇటీవల భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న తరుణంలో ఈ వార్తకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించి.. ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశామని అడిషనల్​ డీజీపీ హిరెన్​ నాథ్​ వెల్లడించారు.

కశ్మీర్​పై ఉగ్రవాద సంస్థ ఇటీవలే ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అసోంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి : అంటరాని గాంధీజీ.. మహాత్ముడికీ తప్పలేదు!

Last Updated : Oct 18, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.