ETV Bharat / bharat

రూ.500 తీసుకొని.. రూ.20గా చూపించి రైల్వే ఉద్యోగి చేతివాటం.. చివరకు..

author img

By

Published : Nov 28, 2022, 8:08 AM IST

Railway Employee Cheating : ప్రయాణికుడికి రూ.500 టోకరా పెట్టేందుకు ప్రయత్నించాడు ఓ రైల్వే టికెట్‌ బుకింగ్‌ క్లర్క్‌. అనుకోని విధంగా చివరకు బుక్కయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

railway employee cheating
రైల్వే ఉద్యోగి మోసం

Railway Employee Cheating : అతడు టికెట్‌ కౌంటర్‌లో పని చేసే ఓ రైల్వే ఉద్యోగి. అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. కానీ, అతడు చేసిన పని అతడి మోసపు బుద్ధికి అద్దం పడుతోంది. దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కోసం వచ్చిన ప్రయాణికుడు రూ.500 ఇచ్చి గ్వాలియర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలుకు టికెట్‌ ఇవ్వమని కోరగా.. ఆయన్ని మాటల్లో పెట్టి.. రూ.500 కాజేశాడు. తన వద్దనున్న రూ.20 నోటును బయటకి తీసి.. ఇది టికెట్‌కు సరిపోదని, మరో రూ.125 ఇవ్వాలని ప్రయాణికుణ్ని డిమాండ్‌ చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియోను 'రైల్‌విష్పర్స్‌' అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. రైల్వే ఉన్నతాధికారులతోపాటు, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా ట్విట్టర్ ట్యాగ్‌ చేశారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. సంబంధిత టికెట్‌ బుకింగ్‌ క్లర్క్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • For necessary action escalated to the concerned official @drm_dli

    — RailwaySeva (@RailwaySeva) November 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.