ETV Bharat / bharat

ముగిసిన రైతుల ర్యాలీ- కిసాన్ మోర్చా ప్రకటన

author img

By

Published : Jan 26, 2021, 8:53 AM IST

Updated : Jan 26, 2021, 8:01 PM IST

POLICE
దిల్లీలో రైతుల రణరంగం

19:41 January 26

పరేడ్​ను తక్షణమే నిలిపివేయాలి

కిసాన్​ గణతంత్ర దినోత్సవం పరేడ్‌ ముగిసిందని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. రైతుల పరేడ్‌ను నిలిపివేసి.. తక్షణమే తమ నిరసన ప్రదేశాలకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించింది. తదుపరి చర్యలపై చర్చలు జరుపుతామని పేర్కొంది.

19:34 January 26

కేంద్ర వైఖరే కారణం

దిల్లీలో హింసాత్మక ఘటనలకు కేంద్రం వైఖరే కారణం అన్నారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌. ప్రధాని మోదీ ఇప్పటికైనా రైతులతో చర్చలు జరపాలన్నారు. 

కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. రైతుల పట్ల కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. 

19:28 January 26

చర్యలు తప్పవు

రైతుల ట్రాక్టర్​ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు చేసినవారి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిల్లీ సంయుక్త పోలీసు కమిషనర్​ అన్నారు. 

19:09 January 26

ట్రాక్టర్ బారికేడ్​లోకి దూసుకెళ్లి..

ఐటీఓ వద్ద తాము ఏర్పాటు చేసిన బారికేడ్లవైపు ట్రాక్టర్​ దూసుకెళ్లి.. నిరసన వ్యక్తం చేసిన రైతు మరణించాడని దిల్లీ పోలీసులు తెలిపారు.

మృతి చెందిన రైతు మృతదేహాన్ని ఘాజీపూర్ తరలించారు అన్నదాతలు. రైతుసంఘాల నేతల పిలుపు మేరకు రైతులు వెనక్కి వెళ్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుగుపయనమయ్యారు.

18:51 January 26

కేంద్ర హోంశాఖ అధికారులతో అమిత్ షా సమీక్ష ముగిసింది. హోంశాఖ కార్యదర్శి, దిల్లీ పోలీసు కమిషనర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, ఇతర సీనియర్‌ అధికారులతో దిల్లీలోని పరిస్థితులపై చర్చించిన షా.. దిల్లీలో అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

18:37 January 26

ఐటీఓ వద్ద  ప్రారంభమైన వాహనాల రాకపోకలు

రైతుల ట్రాక్టర్​ ర్యాలీతో కొన్ని గంటల క్రితం అల్లకల్లోంగా ఉన్న ఆదాయ పన్ను కార్యాలయం ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ట్రాఫిక్​ అంతరాయానికి తెరపడి.. వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

18:33 January 26

'షరతులను ఉల్లఘించారు'

ట్రాక్టర్​ పరేడ్​కు అంగీకరించిన షరతులను నిరసనకారులు ఉల్లంఘించారని దిల్లీ పోలీసులు తెలిపారు. నిర్దేశిత సమయానికి ముందే ర్యాలీని ప్రారంభించారని.. హింసాత్మక ఘటనలు, విధ్వాంసానికి పాల్పడ్డారని వెల్లడించారు. దీంతో ప్రజా ఆస్తులు, తీవ్ర నష్టం వాటిల్లిందన్న పోలీసులు.. పలువురు పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారు.

18:20 January 26

'నిజమైన రైతులు వెనక్కి వచ్చేయండి'

దిల్లీలో దిగ్భ్రాంతికర ఘటనలు వెలుగు చూశాయన్నారు పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్.​హింసాయుత ఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే రైతుల మంచి పేరును హింస చెడగొడుతుందన్నారు. రైతు సంఘాలు ట్రాక్టర్​ ర్యాలీని రద్దు చేశాయన్న ఆయన... నిజమైన రైతులు వెంటనే దేశ రాజధానిని వీడి.. సరిహద్దులకు చేరుకోవాలన్నారు.

17:51 January 26

ముగిసిన ట్రాక్టర్ ర్యాలీ అనుమతి గడువు

  • ముగిసిన ట్రాక్టర్ ర్యాలీ అనుమతి గడువు
  • సాయంత్రం ఐదు గంటల వరకే ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి
  • ఉద్రిక్తతల కారణంగా ఆలస్యంగా సాగుతున్న పరేడ్
  • ఘాజీపూర్ నుంచి వచ్చిన పరేడ్ మినహా ప్రశాంతంగా వెనక్కి వెళ్తున్న మిగిలిన ప్రాంతాల పరేడ్లలు
  • సింఘు, టిక్రి ప్రాంతాల నుంచి వచ్చిన పరేడ్​లు ఔటర్ రోడ్ వైపు పయనం
  • నిర్దేశిత మార్గాల్లో వెళ్తున్న ట్రాక్టర్లు
  • అందరూ నిర్దేశిత మార్గాల్లో పరేడ్ ముగించాలని పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా
  • ఘాజీపూర్ నుంచి వెళ్లిన కొంతమంది రైతులు ఐటివో కూడలి వద్ద బైఠాయింపు
  • మరణించిన రైతు మృతదేహంతో అన్నదాతల నిరసన
  • మధ్యాహ్నం చోటుచేసుకున్న ఉద్రిక్తతల సమయంలో మరణించిన రైతు

17:35 January 26

రైతుల ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తంగా మారడం వల్ల దిల్లీలో భద్రతను పెంచేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. 10 కంపెనీల సీఆర్​పీఎఫ్​ బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది.

17:31 January 26

దిల్లీలో జరిగిన ఘటనలను పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్ ఖండించారు. ఇలాంటి ఘటనలు రైతుల శాంతియుత ఉద్యమంపై ప్రభావం చూపిస్తాయన్నారు. ట్రాక్టర్​ ర్యాలీని నిలిపివేసి రైతులందరూ దిల్లీని వదిలి సరిహద్దులకు రావాలని కోరారు.​

17:16 January 26

రైతుల పరేడ్​లో జరిగిన హింసాత్మక ఘటనలను ఆమ్​ఆద్మీ ఖండించింది. పరిస్థితులు ఇంతవరకూ రావడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించింది. రెండు నెలలుగా రైతు ఉద్యమం శాంతియుతంగా జరిగిందని పేర్కొంది.

17:10 January 26

గణతంత్ర పరేడ్​లో పాల్గొని మరణించిన అన్నదాత మృతదేహంతో ఐటీవో వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు.

16:26 January 26

పార్లమెంటు, విజయ్‌ చౌక్‌, రాజ్‌పథ్‌, ఇండియా గేట్‌ వైపు వచ్చే అన్ని రహదారులు పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేసినట్లు వెల్లడించారు. పలు రహదారులు మూసివేయడం వల్ల అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ నెలకొంది.‌

16:22 January 26

సరిహద్దులతో పాటు.. పలు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలను అమిత్‌ షాకు అధికారులు వివరిస్తున్నట్లు సమాచారం. దిల్లీలో తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశమయ్యారు. దిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో పలు ప్రదేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు, ఎర్రకోట వద్దకు రైతులు చేరుకోవడం.. వంటి ఘటనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అదనపు భద్రతా దళాలకు సూచించారు హోం శాఖ ఉన్నతాధికారులు.

16:08 January 26

  • విజయ్‌ చౌక్‌, పార్లమెంటు భవన్‌, నార్త్‌ సౌత్‌ బ్లాక్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు.
  • ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాధారణ ప్రజలు, పర్యటకులను ఆ ప్రదేశాల నుంచి వెళ్లాలని కోరుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది

16:04 January 26

దిల్లీలోని ఆందోళనకర ప్రాంతాల్లో నేటి మధ్యాహ్నం నుంచి 12 గంటల పాటు అంతర్జాల సేవలను కేంద్ర హోంశాఖ నిలిపివేసింది.

15:57 January 26

రైతుల గణతంత్ర ర్యాలీపై సంయక్త కిసాన్ మోర్చా ప్రకటన విడుదల చేసింది. పరేడ్​లో పాల్గొన్న రైతులకు కృతజ్ఞతలు చెప్పింది. అయితే పరేడ్​లో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించింది. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని తేల్చిచెప్పింది. కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు పరేడ్​ నియమాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. సంఘ విద్రోహ శక్తులు రైతుల శాంతియుత ర్యాలీని పాడుచేసేందుకు యత్నించినట్లు కిసాన్​ మోర్చా ఆరోపించింది.

15:43 January 26

మెట్రో సేవల్లో పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది దిల్లీ మెట్రో. పలు లైన్లలో సమస్యాత్మక ప్రదేశాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేసింది. గ్రే లైన్‌ లో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లు మూసివేసినట్లు ప్రకటించింది.

15:42 January 26

దిల్లీ సరిహద్దులు సింఘు, టిక్రి, ఘాజిపుర్, ముఖుర్బా చౌక్, నగ్లోయ్ సహా ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో టెలికం సేవలు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రత, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది కేంద్ర హోం శాఖ. ఇవాళ అర్ధరాత్రి వరకు సేవలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

15:40 January 26

ఎర్రకోట పరిసర ప్రాంతాల నుంచి ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీఛార్జి చేశారు పోలీసులు.

15:34 January 26

  • దిల్లీ నంగ్లోయ్‌ వద్ద ఉద్రిక్తత
  • నంగ్లోయ్‌ వద్ద రైతులపై పోలీసుల లాఠీఛార్జి
  • ట్రాక్టర్లపై వస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జి
  • బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టిన పోలీసులు

15:29 January 26

ఎర్రకోటపైకి రైతులు ఎక్కి వారి జెండాను ఎగురవేయటాన్ని పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహాద్​ పటేల్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకైన ఎర్రకోటను ఆందోళనకారులు అగౌరవపరిచారన్నారు.

15:24 January 26

  • ఆందోళన ప్రాంతాల్లో ఇంటర్నెట్ తాత్కాలికంగా నిలిపివేసిన కేంద్రం
  • శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
  • సింఘు, టిక్రి, ఘాజిపుర్, ముఖుర్బా చౌక్, నగ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేత
  • అర్ధరాత్రి 12 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేత

14:51 January 26

రైతుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు పలు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని కిసాన్​ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని గుర్తించినట్లు పేర్కొన్నారు.

14:37 January 26

దిల్లీ ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతులు.. రాజ్​పథ్​, రాష్ట్రపతి భవన్​, విజయ్​ చౌక్​ వైపు వెళ్లే అవకాశం ఉందని పోలీసుల సమాచారం.

14:33 January 26

రైతులు తమతో తీసుకువచ్చిన జెండాలను ఎర్రకోట వద్ద ఎగురవేశారు.

14:27 January 26

ఐటీఓ వద్ద రైతు మృతి..

రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. మధ్య దిల్లీ ఐటీఓ ప్రాంతం వద్ద ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

14:20 January 26

రైతుల ర్యాలీపై స్పందించిన రాహుల్​..

రైతుల ర్యాలీపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పందించారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని ట్వీట్​ చేశారు. ఎవరికి ఏమైనా దేశం నష్టపోతుందని అన్నారు. 

దేశప్రయోజనాల కోసం.. కేంద్రం వెంటనే సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

14:12 January 26

ఎర్రకోట వద్ద రైతులు..

రైతుల ట్రాక్టర్​ ర్యాలీ దిల్లీ ఎర్రకోటకు చేరింది. పలు రైతు సంఘాల నాయకులు ఎర్రకోట ఎక్కి.. కేంద్ర ప్రభుత్వానికి, సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

14:02 January 26

ఎర్రకోట వద్ద రైతుల నినాదాలు..

  • ట్రాక్టర్లతో ఎర్రకోట వద్దకు వెళ్లిన రైతులు
  • ఎర్రకోట వద్ద జెండాలు ప్రదర్శిస్తూ రైతుల నినాదాలు
  • దిల్లీ ఐటీవో వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
  • ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్లేందుకు యత్నం
  • ఇండియా గేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులు
  • రైతులను అడ్డుకుంటున్న పోలీసు బలగాలు
  • దిల్షద్‌ గార్డెన్‌ వద్ద స్పృహతప్పిన పోలీసు
  • దిల్లీ: స్పృహతప్పిన పోలీసు ఆస్పత్రికి తరలింపు

13:41 January 26

ముందుగా పోలీసులకు చెప్పిన మార్గంలో కాకుండా రైతులు పరేడ్​ రూట్​ను మార్చారు. ఆందోళనకారులు ట్రాక్టర్లపై ఎర్రకోట చేరుకున్నారు. 

13:26 January 26

రూట్​ మ్యాప్​ను కాదని సెంట్రల్​ దిల్లీలోకి ప్రవేశించిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. రైతులు సైతం పోలీసులపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఐటీఓ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

13:18 January 26

దిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తోన్న రైతులను అడ్డుకునేందుకు నన్​గ్లోయి వద్ద పోలీసులు రోడ్డుపై బైఠాయించారు. 

13:00 January 26

  • పోలీసులు అడ్డుగా పెట్టిన వాహనాలపై రైతుల దాడి
  • రైతులపై బాష్పవాయువు ప్రయోగించిన దిల్లీ పోలీసులు
  • ట్రాక్టర్లతో బారికేడ్లను తొలగించిన రైతులు
  • పోలీసులపై దాడికి యత్నించిన ఆందోళనకారులు
  • దిల్లీ: ఆదాయ పన్ను కార్యాలయం వద్ద బారికేడ్లను తోసేసిన రైతులు
  • దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ బస్సును ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • ఇండియా గేట్, రాజ్‌పథ్, రాజ్‌ఘాట్ వైపు రైతులు వెళ్లకుండా అడ్డగింత
  • రాజ్‌పథ్ వైపు వెళ్లేందుకు యత్నించిన రైతులు
  • రైతులపై బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
  • ఎక్కడికక్కడ బారికేడ్లను తీసుకుంటూ ముందుకెళ్తున్న ఆందోళనకారులు
  • దిల్లీ మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేసిన డీఎంఆర్‌సీ

12:57 January 26

సెంట్రల్​ దిల్లీలోని ఐటీఓ వద్ద రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. 

12:52 January 26

రైతుల గణతంత్ర పరేడ్ హింసాత్మకంగా మారింది. బారీకేడ్లను దాటుకొని దిల్లీలో ప్రవేశించిన రైతులు.. అడ్డుపడిన పోలీసులపై దాడికి దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.

12:46 January 26

దిల్లీ పోలీసు హెడ్​క్వార్టర్స్​ ఎదురుగా ఉన్న బారీకేడ్లను దాటుకొని రైతులు ఐటీఓ చేరుకున్నారు.

12:42 January 26

గణతంత్ర కవాతు చేస్తోన్న రైతులు ఐటీఓ ప్రాంతంలో ఓ డీటీసీ బస్సును ధ్వంసం చేశారు. 

12:21 January 26

ఘాజీపుర్​ సరిహద్దు నుంచి రైతులు ప్రగతి మైదాన్​ దగ్గరకు చేరుకున్నారు. సెంట్రల్​ దిల్లీ వైపు రైతులు వెళ్తున్నారు,

11:51 January 26

కర్నాల్​ బైపాస్​ వద్ద బారీకేడ్లను తొలగించి దిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నించారు. పోలీసులు వారిని నిలువరిస్తున్నారు.

11:43 January 26

వాహనంపైకి ఎక్కిన రైతులు

రైతులు వెనక్కి తగ్గకపోయేసరికి పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయితే రైతులు.. వాహనంపైకి ఎక్కి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

11:41 January 26

బాష్పవాయువు ప్రయోగం

దిల్లీ సంజయ్​ గాంధీ ట్రాన్స్​పోర్ట్​ నగర్​ వద్ద రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. సింఘు సరిహద్దు నుంచి రైతులు ర్యాలీగా ఇక్కడకు చేరుకున్నారు.

11:29 January 26

పోలీసులపై కత్తులతో రైతుల దాడి

రైతుల ట్రాక్టర్​ ర్యాలీతో దిల్లీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులపై లాఠీఛార్జీ చేసిన పోలీసులపై రైతులు కత్తులు, కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.

11:21 January 26

దిల్లీ అక్షర్​ధామ్​ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. 

10:58 January 26

  • Delhi: Police use tear gas to disperse farmers at Sanjay Gandhi Transport Nagar

    Farmers tractor rally form Singhu border arrived here pic.twitter.com/g36JzH4ke4

    — ANI (@ANI) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సింఘ సరిహద్దు నుంచి దిల్లీలో ప్రవేశించిన రైతులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. సంజయ్​ గాంధీ ట్రాన్స్​పోర్ట్​ నగర్​లో పెద్ద ఎత్తున బలగాలు రైతులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

10:41 January 26

  • దీక్షా శిబిరాల నుంచి ప్రారంభమైన కిసాన్ గణతంత్ర పరేడ్​
  • అనుకున్న సమయనికంటే ముందుగానే ర్యాలీగా బయలుదేరిన రైతులు
  • దిల్లీలోకి ప్రవేశించిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
  • సింఘు, టిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల నుంచి ప్రారంభమైన ర్యాలీ
  • పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీగా ముందుకు సాగుతున్న రైతులు
  • పలు చోట్ల బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లిన రైతులు
  • సాగు చట్టాలు రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
  • అనుమతిచ్చిన మార్గాల్లో ర్యాలీగే వెళ్లేలా పోలీసులు చర్యలు
  • పూర్తి స్థాయిలో దిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బందోబస్తు

09:36 January 26

దిల్లీలోకి ప్రవేశించిన ట్రాక్టర్లు..

టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు దిల్లీలోకి ప్రవేశించాయి. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దేశ రాజధానిలో పరేడ్​కు సిద్ధమయ్యారు. 

09:26 January 26

సింఘూ సరిహద్దు వద్ద..

రిపబ్లిక్​ డే సందర్భంగా.. దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ కోసం రైతులు భారీగా తరలివెళ్తున్నారు. దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు రైతులు.  

09:23 January 26

దిల్లీ ధాన్సా సరిహద్దు వద్ద ర్యాలీ..

దిల్లీ ధాన్సా సరిహద్దు వద్ద.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

09:10 January 26

టిక్రీ సరిహద్దు వద్ద ఉద్రిక్తం..

దిల్లీ-హరియాణా టిక్రీ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాక్టర్ ర్యాలీకి సిద్ధమైన రైతులు.. బారికేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

08:23 January 26

లైవ్​ అప్​డేట్స్​: ట్రాక్టర్​ ర్యాలీకి రైతులు సన్నద్ధం

సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరు చేస్తున్న రైతులు  కిసాన్ గణతంత్ర పరేడ్‌కు సిద్ధమయ్యారు. ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే ట్రాక్టర్లతో దిల్లీ చేరుకున్నారు. ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న దిల్లీ పోలీసులు ఐదువేల ట్రాక్టర్లు, ఐదు వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

సాగు చట్టాల రద్దు కోసం రెండు నెలలుగా కొనసాగుతున్న రైతు ఉద్యమం చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భారీ కవాతు నిర్వహించేందుకు పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ నంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలివచ్చారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే దిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపుర్‌లోని దీక్షా శిబిరాల వద్ద నుంచి శకటాలు, ట్రాక్టర్లు ప్రదర్శనగా బయలుదేరుతాయి.

Last Updated : Jan 26, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.