కరోనా కారణంగా తొమ్మిది నెలలుగా మూతపడి ఉన్న పూరీ జగన్నాథ ఆలయాన్ని.. ఈరోజు తిరిగి తెరిచారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ చూపించిన వారినే దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
భక్తులు తప్పనిసరిగా కొవిడ్ రిపోర్ట్‌ను ఆలయం బయట సంబంధిత అధికారులకు ఇవ్వాలి. నెగెటివ్ వస్తేనే దర్శనానికి వెళ్లనిస్తారు. రోజుకు 15వేల నుంచి 17వేల భక్తులు మందిరానికి వచ్చే అవకాశం ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న 'మహా ప్రసాదం'లోకి మాత్రం ఎవ్వరినీ అనుమతించం.
- బల్వంత్ సింగ్, పూరీ జిల్లా కలెక్టర్
ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం గతనెల 23న ఈ పుణ్య క్షేత్రాన్ని తెరిచారు. డిసెంబర్ 26-31 వరకు పూరీ మున్సిపాలిటీ నివాసితులకు దర్శనానికి అనుమతించారు. అయితే నేటి నుంచి సామాన్య భక్తుల కోసం ఆలయాన్ని తెరిచారు.
ఇదీ చదవండి: టీకా వినియోగంపై నేడు డీసీజీఐ కీలక ప్రకటన