ETV Bharat / bharat

మానసిక వైద్యుడి 'మత్తు కేకుల' దందా

author img

By

Published : Jul 14, 2021, 5:05 PM IST

Updated : Jul 14, 2021, 5:20 PM IST

మానసిక వైద్యుడి మత్తు దందా గుట్టురట్టు చేసింది మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్​సీబీ). కేకుల్లో అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న వైద్యుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 10కేజీల మత్తుకేకులను స్వాధీనం చేసుకున్నారు.

drugs from cake
మత్తు కేకులు

మత్తు పదార్థాల విక్రయానికి కొత్త దారి ఎంచుకున్నాడు ఓ మానసిక వైద్యుడు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్​తో కేసులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్​సీబీ) అధికారులు వైద్యుడిని అరెస్ట్​ చేశారు.

drugs from cake
మత్తు కేకులను స్వాధీనం చేసుకున్న ఎన్​సీబీ అధికారులు

ముంబయికి చెందిన రహీమ్​ చర్నియా.. ఓ మానసిక వైద్యుడు. మజ్​గావ్ ప్రాంతంలో ఓ బేకరీ ఏర్పాటు చేశాడు. డ్రగ్ స్మగ్లర్ల వద్ద మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి.. మత్తు కేకులను తయారు చేసేవాడు. ఈ కేకులకు హష్​ బ్రొవైన్ పేరుతో విక్రయిస్తుండేవాడు. అంతేకాక కేకుల్లో మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాడు. రహీమ్ వ్యాపారంపై పక్కాసమాచారం తెలుసుకున్న ఎన్​సీబీ బృందం.. బుధవారం అతడిని అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి 10 కేజీల మత్తు కేకులు, లక్షా 70వేల నగదు, 370 గ్రాముల డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఎటు చూసినా వరద.. మధ్యలో బస్సు.. ఏమైందంటే?

Last Updated : Jul 14, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.