ఉత్తారాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం సోమవారం ఉదయం తెరుచుకుంది. వేదమంత్రాలు, ప్రత్యేక పూజల నడుమ ఆలయ ద్వారాలను తెరిచారు పండితులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూజలు మాత్రమే జరుగుతాయని, భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. చార్దామ్ యాత్రను వాయిదా వేసినట్లు చెప్పారు.
"కేదార్నాథ్ ఆలయం ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజల నడుమ తెరుచుకుంది. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని బాబా కేదార్‌నాథ్‌ను ప్రారంభిస్తున్నాను."
- తీరత్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ సీఎం
బద్రీనాథ్ ఆలయం మంగళవారం తెరుచుకోనుంది.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చార్దామ్ యాత్రను రద్దు చేసింది ప్రభుత్వం. ఆలయం తెరుచుకున్న నేపథ్యంలో భక్తులకు ఆన్లైన్ ద్వారా దర్శించుకునే వీలు కల్పించారు.
ఇదీ చూడండి: మరో 24గంటల్లో 'తౌక్టే' మహోగ్రరూపం