ETV Bharat / bharat

సౌదీ రాజకుమారుడితో మోదీ ఫోన్ సంభాషణ - మోదీ సౌదీ అరేబియా

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సౌదీ అరేబియా రాజకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్​తో ఫోన్​లో సంభాషించారు. 2019లో ఇరు దేశాలు ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక,వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పనితీరుపై ఇరువురు సమీక్షించారు.

PM, Saudi Crown Prince review ties; Modi expresses wish to expand bilateral trade
సౌదీ రాజ కుమారుడికి మోదీ ఫోన్​.. ఏం మాట్లాడారంటే?
author img

By

Published : Mar 10, 2021, 9:59 PM IST

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్​తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్​లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరింత విస్తరించాలని ప్రధాని కోరారు. సౌదీ పెట్టుబడిదారులకు భారత ఆర్థిక వ్యవస్థ అనేక అవకాశాలను ఇస్తోందని తెలిపారు.

2019 లో స్థాపించబడిన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పనితీరును ఇరువురు నాయకులు సమీక్షించారు. భారత్-సౌదీ భాగస్వామ్యంలో స్థిరమైన వృద్ధి సాధించడంపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరులో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో సౌదీ రాజకుమారుడు భారత్​లో పర్యటించాలని మోదీ ఆహ్వనించారు.

ఇదీ చూడండి: ఎన్నికలకు ఉదయనిధి స్టాలిన్​ దూరం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.