ETV Bharat / bharat

జవాన్లతో కలిసి మోదీ దీపావళి సంబరాలు- దేశ ప్రజలకు ప్రధాని పండగ శుభాకాంక్షలు

PM Modi Celebrates Diwali With Jawans : ప్రధాని నరేంద్రమోదీ ఈసారి కూడా దీపావళి వేడుకలను దేశ సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకొన్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాకు వెళ్లారు.

PM Modi Celebrates Diwali With Jawans
PM Modi Celebrates Diwali With Jawans
author img

By PTI

Published : Nov 12, 2023, 12:03 PM IST

Updated : Nov 12, 2023, 2:35 PM IST

PM Modi Celebrates Diwali With Jawans : ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. ఇందుకోసం ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దైన లెప్చాకు చేరుకున్న ఆయన.. జవాన్​లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు లెప్చాలో సైనికులతో మాట్లాడుతున్న పలు చిత్రాలను ఆయనే స్వయంగా ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు, టోపీ ధరించిన మోదీ.. సైనికులతో ముచ్చటించారు.

'మీరుండే చోటే నాకు అయోధ్య..'
జవాన్​లతో మాట్లాడిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగించారు మోదీ. 'నేను ప్రతి సంవత్సరం వచ్చి మా ఆర్మీ సిబ్బందితో దీపావళి పండగను జరుపుకుంటున్నాను. శ్రీ రాముడు ఉన్న స్థలాన్ని అయోధ్య అని అంటారు. కానీ, నా దృష్టిలో భరతమాత రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన భద్రత దళాలు ఉండే చోటునే నేను అయోధ్యగా పిలుస్తాను. గత 30-35 సంవత్సరాలుగా నేను మీ(ఆర్మీ)తో దీపావళిని జరుపుకోని ఏడాది లేదు. నేను ప్రధాని, సీఎం హోదాల్లో లేనప్పుడు కూడా మన దేశ సరిహద్దుల్లోని జవాన్​లతో దీపావళి పండగను జరుపుకున్నాను' అని మోదీ వ్యాఖ్యానించారు.

  • VIDEO | PM Modi interacts with Army jawans in Lepcha in Himachal Pradesh on the occasion of Diwali and extends greetings to the people of the country.#Diwali pic.twitter.com/a9uSMQSjtb

    — Press Trust of India (@PTI_News) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • "The courage of our security forces is unwavering. Stationed in the toughest terrains, away from their loved ones, their sacrifice and dedication keep us safe and secure. India will always be grateful to these heroes who are the perfect embodiment of bravery and resilience,"… pic.twitter.com/KZf6UYlpHs

    — ANI (@ANI) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మన భద్రతా బలగాల ధైర్యం వెలకట్టలేనిది. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎంతో కష్టతరమైన ప్రాంతాల్లో పహారా కాస్తుంటారు. వారి త్యాగం, దేశం పట్ల అంకితభావం వలనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాము. ధైర్యంతో శత్రువుల నుంచి మనల్ని కాపాడుతున్న వీరులకు భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది."

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'ఈ దీపావళి మీకు ప్రత్యేకంగా నిలవాలి..'
Modi In Lepcha : అంతకుముందు కూడా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ. దేశ ప్రజలందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. 'మన ధైర్యమైన భద్రతా దళాలతో కలిసి దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నాను. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగ మీ అందరి జీవితాల్లో ఆనందం, మంచి ఆరోగ్యం, సమృద్ధిని తేవాలని ఆకాంక్షిస్తున్నాను' అని పేర్కొన్నారు.

  • देश के अपने सभी परिवारजनों को दीपावली की ढेरों शुभकामनाएं।

    Wishing everyone a Happy Diwali! May this special festival bring joy, prosperity and wonderful health to everyone’s lives.

    — Narendra Modi (@narendramodi) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Modi Diwali : 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రతి దీపావళిని క్రమం తప్పకుండా ఇలా సరిహద్దుల్లోని భద్రతా దళాలతో కలిసి జరుపుకుంటున్నారు. సైనిక సిబ్బందితో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లోని జవాన్​లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గత ఏడాది కార్గిల్‌ బోర్డర్​లో వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో సైనిక కేంద్రాలను సందర్శిస్తూ జవాన్ల బాగోగులు సైతం అడిగి తెలుసుకుంటున్నారు.

  • #WATCH | Lepcha, Himachal Pradesh: Prime Minister Narendra Modi says, "I come and celebrate Diwali every year with our Army personnel. It is said that Ayodhya is where Lord Ram is, but for me, Ayodhya is where Indian Army personnel are...I have not celebrated any Diwali for the… pic.twitter.com/AOatw3DjAA

  • VIDEO | "There has not been a single Diwali in the last 30-35 years, that I have not celebrated with you (Army jawans). When I was neither the PM nor the CM, I still used to go to the border on the occasion of Diwali," says PM Modi while interacting with Army jawans in Lepcha,… pic.twitter.com/z4pw5nEdr6

అక్షర్​ధామ్​ ఆలయంలో దీపావళి వేడుకలు- 'గ్లో గార్డెన్​ థీమ్'​తో 10వేల దీపాలంకరణ!

14,000 అడుగుల విస్తీర్ణంలో హనుమాన్, మోదీ చిత్రాలు-వినూత్నంగా దీపావళి వేడుకలు

Last Updated : Nov 12, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.