కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు... వారివారి మంత్రిత్వశాఖల బాధ్యతలు చేపట్టారు. రైల్వే మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్ అధికారి, వ్యాపారవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన అశ్వినీ వైష్ణవ్‌కు 15ఏళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో మౌలికవసతుల కల్పన ప్రాజెక్టులపై పనిచేసిన అనుభవం ఉంది. కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగానూ నియమితులైన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
అశ్వినీ వైష్ణవ్- రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ అశ్వినీ వైష్ణవ్‌కు అభినందనలు తెలుపుతున్న అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల తర్వాత దస్త్రంపై సంతకం చేశారు.
న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు సహా పలువుర మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు చేపట్టారు.
మాన్సుఖ్ మాండవియా.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలు స్వీకరించారు. న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు బాధ్యతలు తీసుకున్నారు. జౌళి; వినియోగదారుల వ్యవహారాల శాఖ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ పశుపతి కుమార్ పరాస్- ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా మీనాక్షీ లేఖీ బాధ్యతలు తీసుకున్నారు. సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకుర్ బాధ్యతలు స్వీకరించారు. సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకుర్ బాధ్యతలు స్వీకరించారు. జితేంద్ర సింగ్.. ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) రైల్వే శాఖ సహాయ మంత్రిగా దర్శన విక్రమ్ జార్డోశ్ బాధ్యతలు చేపట్టారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పురీ బాధ్యతలు స్వీకరించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ బాధ్యతలు చేపట్టారు. పర్యావరణం, కార్మిక శాఖల మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియా సింగ్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.