ETV Bharat / bharat

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది అరెస్ట్​ - గుజరాత్​లో కరోనా నిబంధనల ఉల్లంఘన

కొవిడ్​ నిబంధనల ఉల్లంఘించిన 46 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. గుజరాత్​లోని రాయ్​పుర్​లో బుధవారం జరిగింది ఈ ఘటన.

Thousands throng Gujarat temple, Ahmedabad covid guidelines flouted
గుజరాత్​లో కరోనా నిబంధనల ఉల్లంఘన
author img

By

Published : May 7, 2021, 1:59 PM IST

కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. చాలా చోట్ల ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు అయితే ఈ వైరస్​కు మత విశ్వాశాలతో ముడిపెడుతున్నారు. గుజరాత్​లోని ఆహ్మదాబాద్​ జిల్లాలో బుధవారం ఇటువంటి ఘటనే జరిగింది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా.. వందల సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు 46 మందిని అరెస్ట్​ చేశారు.

ఆ గ్రామస్థుల విశ్వాసం..

ఈ మహమ్మారి ఒక శాపం అని.. స్థానికంగా ఉన్న బలియదేవ్​ ఆలయంలో అభిషేకం నిర్వహిస్తే గానీ వైరస్​ కట్టడి కాదని రాయ్​పుర్​ సహా చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ వందల సంఖ్యలో గ్రామస్థులు ఆలయానికి వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

అంతకుముందు కూడా..

మే 3న కూడా సనంద్​ ప్రాంతంలోని నవపుర, నిద్ర గ్రామాల్లో ఇటువంటి ఘటనే జరిగింది. కరోనా నిబంధనలను లెక్కచేయకుండా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకుగానూ పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి : 'కేంద్రం వైఫల్యమే కరోనా సంక్షోభానికి కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.