ETV Bharat / bharat

ఆ ఊరిలో రెండో అంతస్తు కట్టాలంటే వణుకు! - రెండో ఫ్లోర్​ కట్టాలంటే భయపడే గ్రామం

రాజస్థాన్‌లో ఒక్కో ఊరికి ఒక్కో గాథ ఉంటుంది. కొన్ని కథలు ఆసక్తికరంగా ఉంటే, మరిన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. చురూ జిల్లాలోని ఉడ్‌సర్ అనే గ్రామానికీ ఓ కథ ఉంది. అందుకే ఊరి ప్రజలు తమ ఇంటిపై రెండో అంతస్తు కట్టడాన్ని పూర్తిగా నిషేధించారు.

people fear to built second floor in rjasthan's udsar
ఆ ఊరిలో రెండో అంతస్తు కట్టాలంటే వణుకు!
author img

By

Published : Mar 18, 2021, 2:44 PM IST

Updated : Mar 18, 2021, 3:14 PM IST

రెండో అంతస్థు కట్టాలంటేనే భయపడే గ్రామస్థులు

మనం సాధారణంగా అపోహలను అస్సలు నమ్మం, మూఢనమ్మకాలను కొట్టిపారేస్తాం. కానీ 700 ఏళ్లుగా ప్రజల మనసుల్లో ఆ భయం పాతుకుపోయింది.

ఇది ఓ గ్రామాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ శాపం కథ. 700 ఏళ్ల క్రితం భూమియా అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు ఆవులంటే మహాప్రీతి. ఓసారి ఊరి నుంచి కొందరు దుండగులు ఆవులను దొంగిలించడం చూశాడు భూమియా. దొంగలతో పోరాడి.. ఆవులను రక్షిస్తాడు. తీవ్ర గాయాలతో పక్క ఊరు అస్పలాసార్‌లోని అత్తవారింటికి వెళ్తాడు. రెండో అంతస్తులోని ఓ గదిలో తలదాచుకుంటాడు. కానీ, భూమియాను వెదుక్కుంటూ దొంగలు ఆ ఇంటికీ వెళ్తారు. కింద అంతస్తులోని కుటుంబసభ్యులపై దాడిచేస్తారు. వాళ్లు భయపడి, భూమియా పై అంతస్తులోని గదిలో ఉన్నట్లు చెబుతారు. ఆగ్రహంతో పైకి వెళ్లి, భూమియా తల నరికేస్తారు దొంగలు. ఈ ఘటనతో తీవ్ర కలత చెందిన భూమియా భార్య.. గ్రామస్థులను శపిస్తుంది.

ఊరిప్రజలు శాపం కారణంగా బాధలు పడ్డ తర్వాత, రెండో అంతస్తు నిర్మించకూడదని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ముగ్గరు ప్రయత్నించినా కట్టలేకపోయారు. 600 ఏళ్ల కిందటి మాట ఇది.

--స్థానికుడు.

రెండో అంతస్తు కట్టకపోవడం ఊర్లో చాలాకాలంగా కొనసాగుతున్న ఆచారం.

--స్థానికుడు.

అనంతరం, భూమియా... ఉడ్‌సర్ ప్రజల గ్రామదేవతగా మారినట్లు, గుడి కూడా కట్టినట్లు చెబుతారు. ఆ గాథను ఇప్పటికీ బలంగా నమ్ముతారు.

దొంగలు దాడి చేసినప్పుడు... కుటుంబసభ్యులు భయపడి, భూమియా రెండో అంతస్తులోని గదిలో నిద్రపోతున్నట్లు చెబుతారు. ఆ గదికి వెళ్లి, దుండగులు ఆయన తల నరికేస్తారు.

--బాబులాల్ పరీక్, ప్రభుత్వ పాఠశాల ఉద్యోగి.

ఇదో శాపం. రెండో అంతస్తు కట్టేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవు. లేదంటే ఆ ఇంట్లో ఏదో ఒక అరిష్టం జరుగుతుంది.

--సంత్‌లాల్ బిజార్నియా, స్థానికుడు.

ఊర్లో ప్రచారంలో ఉన్న భూమియా కథ నిజమో, కాదో కచ్చితంగా తెలియదు. కానీ.. ప్రజల్లో మాత్రం ఆ కథ పట్ల నమ్మకం, భయం తారస్థాయిలో ఉంది.

రెండో అంతస్తు కట్టుకున్న ప్రతివాళ్లింట్లో ఏదో ఒక కీడు జరిగింది. ఆ భయంతో అప్పటినుంచీ ఎవ్వరూ రెండో అంతస్తు కట్టే ధైర్యం చేయలేదు.

--రామచంద్ర పాండ్యా, స్థానికుడు.

ఇదీ చదవండి:పోలీసులే బంధువులు- స్టేషనే ఆమె ఇల్లు!

Last Updated : Mar 18, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.