ETV Bharat / bharat

ఆన్​లైన్​ రుణాల స్కామ్​లో షాకింగ్ నిజాలు

author img

By

Published : Jan 6, 2021, 4:30 PM IST

ఆన్​లైన్​లో ఇన్​స్టంట్​ లోన్​ యాప్​ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కిండల్ టెక్నాలజీస్​ సంస్థ 100 మంది ఉద్యోగులతో బెంగళూరు కేంద్రంగా రుణ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆన్​లైన్​ రుణ యాప్​ల నిర్వహణ కోసం 600 సిమ్​కార్డులను వినియోగించినట్లు పేర్కొన్నారు. సంస్థ నిర్వాహకులు ప్రేమలత, భవన్​ సహా కుంభకోణం ముఖ్య సూత్రధారులైన చైనీయులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Online instant Loan Scam busted, Shocking revelations
ఆన్​లైన్​ రుణాల స్కామ్​లో షాకింగ్ నిజాలు

ఆన్​లైన్​ రుణాల కుంభకోణానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. బెంగళూరు కేంద్రంగా కిండల్​ టెక్నాలజీస్​ అనే సంస్థ 100మంది ఉద్యోగులతో ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రేమలత, భవన్​ను సీబీసీఐడీ బృందం అరెస్టు చేసింది. ఈ కుంభకోణానికి సూత్రధారులైన చైనీయులు జియోవా యమావ్​, వు యువాన్లుమ్​ను కూడా అదుపులోకి తీసుకుంది.

ఆన్​లైన్ ఇన్​స్టంట్​ లోన్​ యాప్​ల కోసం 600 సిమ్​ కార్డులను కిండల్ టెక్నాలజీస్ వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంస్థలో మొత్తం 150మంది ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం మొత్తానికి ప్రధాన సూత్రధారి చైనాకు చెందిన హాంగ్ అని వెల్లడించారు. చైనాలో ఉంటూనే 'డింగ్​ డాంగ్' యాప్​ను ఉపయోగించిన ఇక్కడి రుణయాప్​లను రోజూ పరిశీలిస్తునట్లు చెప్పారు.​

ఇదీ చూడండి: అంగన్​వాడీ కార్యకర్త గ్యాంగ్​ రేప్- అవయవాలు ఛిద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.