ETV Bharat / bharat

వారే నిజమైన 'తుక్డే తుక్డే గ్యాంగ్​': కపిల్ సిబల్

నిజమైన 'తుక్డే తుక్డే గ్యాంగ్​' రైతులు కాదని, పాలసీలతో సమాజంలో భయాందోళనలు సృష్టించేవారని.. కేంద్రంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్ నేత కపిల్​ సిబల్​.

one who causes panic in society through policies is real 'Tukde Tukde Gang', says Sibal
వారే నిజమైన 'తుక్డే తుక్డే గ్యాంగ్​': కపిల్ సిబల్
author img

By

Published : Dec 14, 2020, 11:26 AM IST

కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్​లో విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్. అనవసరమైన పాలసీలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేవారే నిజమైన 'తుక్డే తుక్డే గ్యాంగ్'.. రైతులు కాదని స్పష్టం చేశారు.

" ఎవరు తుక్డే తుక్డే గ్యాంగ్​ ?... ఎవరైతే ప్రతి పౌరుడిని రెండు కోణాల్లో చూస్తారో, ఎవరైతే ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొడతారో, ఎవరైతే పాలసీలతో సమాజంలో భయాందోళనలు సృష్టిస్తారో, ఎవరు గాడ్సేను పొగుడుతారో వారు 'తుక్డే తుక్డే గ్యాంగ్​'.. రైతులు కాదు."

--ట్విట్టర్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్ సిబల్​

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ- హరియాణా సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే రైతు నాయకులతో కేంద్రం ఆరు సార్లు చర్చలు జరిపింది. చట్టాల్లో మార్పులు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సైతం హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.

ఇదీ చదవండి : నిరహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.