భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్), పంజాబ్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్ హతమయ్యాడు. పంజాబ్ అమృత్‌సర్‌లోని కక్కర్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది.
ఘటనాస్థలం నుంచి 22 ప్యాకెట్ల హెరాయిన్‌తో పాటు.. 2 ఏకేఎం రైఫిల్స్, 4 రౌండ్ల మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిపైనా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
పాకిస్థాన్ నుంచి అంతర్జాతీ సరిహద్దు వెంబడి మాదకద్రవ్యాల సరఫరా పెరుగుతుండటం పంజాబ్‌కు తీవ్ర సమస్యగా మారింది.
ఇదీ చదవండి: భారత్-పాక్ సరిహద్దులో రూ.70కోట్ల హెరాయిన్ పట్టివేత