దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ స్వీటు షాపు.. సరికొత్త మిఠాయిను తయారుచేసింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో చేసిన స్వీటును 'సువర్ణ కలష్' పేరుతో మార్కెట్లో విక్రయిస్తోంది. దీని ధర కూడా ఎక్కువే. కేజీ స్వీటు ధర రూ.11,000.
మొత్తం 12 కేజీల స్వీటును తయారు చేసినట్లు రఘువీర్ మిఠాయి షాపు నిర్వాహకుడు తేజస్ పోపత్ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు వివరించారు.
సోమవారం నాటికి 6-7కేజీల స్వీట్స్‌ను విక్రయించామన్నారు. కొవిడ్-19 కారణంగా గతేడాది ఈ ప్రత్యేక స్వీట్‌ను తయారు చేయలేదని చెప్పారు రఘువీర్.
ఇదీ చూడండి: అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం కాన్వాయ్.. ముఖ్యమంత్రే స్వయంగా...