ETV Bharat / bharat

హెల్మెట్​ లేదని ట్రక్కు డ్రైవర్​కు రూ.వెయ్యి జరిమానా

author img

By

Published : Mar 18, 2021, 8:53 AM IST

Updated : Mar 18, 2021, 9:11 AM IST

ఒడిశాలోని ఓ ట్రక్కు డ్రైవర్​ తన వాహనం పర్మిట్​ రిన్యూవల్​ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అందించిన చలానా చూసి ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎందుకంటే అతను హెల్మెట్​ లేకుండా ట్రక్కు నడుపుతున్నాడని పేర్కొంటూ వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.

odisha
హెల్మెట్​ లేదని ట్రక్కు డ్రైవర్​కు జరిమానా

హెల్మట్​ లేదంటూ ఓ ట్రక్కు డైవర్​కు అధికారులు రూ.1000 జరిమానా విధించారు. ఈ ఘటన ఈనెల 12న ఒడిశాలోని గంజాం జిల్లా బర్హంపుర్ పట్టణంలో జరిగింది.

truck driver
ట్రాఫిక్​ పోలీసుల చలానా

ఇదీ జరిగింది..

బర్హంపుర్​లోని జి.జగన్నాథపుర్​కు చెందిన ప్రమోద్ కుమార్ స్వైన్ ఈనెల 12న తన వాహనం పర్మిట్​ రిన్యూవల్​ చేయించేందుకు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అధికారులు అతనికి చలానా అందించారు. గతేడాది డిసెంబరు 24న బెర్హంపుర్​ ట్రాఫిక్​ పోలీసులు విధించిన ఈ చలానాలో.. ప్రమోద్​ తన ట్రక్కును హెల్మెట్​ లేకుండా నడుపుతున్నాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ప్రైవేటు​ బస్సు బోల్తా - 16మందికి గాయాలు

Last Updated : Mar 18, 2021, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.