ETV Bharat / bharat

మహిళా క్రికెటర్ మృతి.. అడవిలో మృతదేహం.. శరీరంపై గాయాలు.. ఏమైంది?

author img

By

Published : Jan 13, 2023, 4:09 PM IST

Updated : Jan 13, 2023, 5:37 PM IST

ఒడిశాలో ఓ మహిళా క్రికెట్​ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రెండు రోజుల క్రితం స్టేట్ క్రికెట్​ టీమ్ నుంచి మిస్సైన ఆమె.. శరీరంపై గాయాలతో అటవీ ప్రాంతంలో ఉరి వేసుకుని చేట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి కుటుంబసభ్యులు ఆమెను ఎవరో హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

odisha state woman cricketer murder
మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్​

ఒడిశాలో ఓ యువ మహిళా క్రికెటర్​ అడవిలో శవమై కనిపించింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆమె దట్టమైన అటవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె శరీర భాగంపై చాలా చోట్ల గాయాలున్నందును దీన్ని హత్యగా భావించి.. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్​ జిల్లాలో రాజశ్రీ స్వైన్​ అనే యువ మహిళా క్రికెటర్ కనిపించడంలేదని ఆమె కోచ్​ జనవరి 11న మంగళబాగ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం అతాగఢ్​ అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు శరీరంపై గాయలున్నందును ఆమె కుటుంబసభ్యులు ఇది ఆత్మహత్య కాదని, రాజశ్రీని ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపించారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆదే ప్రాంతంలో మృతురాలి స్కూటీని గుర్తించామని తెలిపారు.

పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్​ టోర్నమెంట్​ కోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్​ బజ్రకబాటి ప్రాంతంలో శిక్షణా శిబిరం నిర్వహించింది. ఈ శిక్షణలో రాజశ్రీతో పాటుగా మరో 25 మంది మహిళా క్రికెటర్​లు పాల్గొన్నారు. వీరంతా అదే ప్రాంతంలోని ఓ హోటల్లో బసచేస్తున్నారు. అయితే జనవరి 10న క్రికెట్​ అసోసియేషన్​ ప్రకటించిన రాష్ట్ర​ జట్టులో రాజశ్రీకి చోటుదక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ మరుసటి రోజు మిగతా క్రీడాకారిణిలందరూ ప్రాక్టీస్ కోసం వెళ్లగా.. రాజశ్రీ మాత్రం తన తండ్రిని కలవడానికి పూరీకి వెళ్తున్నట్లు కోచ్​కు తెలిపింది.

Last Updated : Jan 13, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.