అంగవైకల్యంతో జన్మించిన ఓ నవజాత శిశువు.. పుట్టిన రెండు వారాలకే కొవిడ్ బారిన పడింది. తీవ్ర అనారోగ్య సమస్యల నడుమ దాని నుంచి బయటపడింది. మూడు వారాలపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కరోనాపై విజయం సాధించింది. ఇంతకీ ఎవరా చిన్నారి? అంత పసి వయస్సులో బహుళ సమస్యలతో మహమ్మారిపై ఎలా విజయం సాధించిందో తెలుసుకుందాం.
10 రోజులు వెంటిలేటర్‌పై..
ఒడిశా కలాహాండి జిల్లాలోని ఎం.రామ్‌పుర్‌కు చెందిన అంకిత్ అగర్వాల్, ప్రీతిలకు.. గత మార్చి 22న ఓ శిశువు జన్మించింది. తల్లిదండ్రులకు కరోనా సోకడం వల్ల.. పసికందుకు కూడా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. పుట్టిన కొద్దిరోజులకే విపరీతమైన జ్వరం, స్పృహ లేకపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటివి ఆ శిశువును చుట్టుముట్టాయి. స్థానిక వైద్యుని సలహా మేరకు భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. అక్కడ సుమారు 10 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు.
ఇదీ చదవండి: కరోనాను జయించిన 4 నెలల పసికందు
బహుళ అంగ వైకల్య లక్షణాలతో.!
శిశువుకు బహుళ అంగ వైకల్య లక్షణాలు కనిపిస్తున్నందున.. ఆ చిన్నారి భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఆశలు సన్నగిల్లాయి. అయితే.. ఇంతటి కఠిన పరిస్థితుల్లోనూ వైరస్‌పై పోరాడి.. విజయం సాధించింది ఆ రెండు నెలల పసికందు. మూడు వారాల అనంతరం.. మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలింది. దీంతో ఆ శిశువును డిశ్ఛార్జ్ చేశారు వైద్యులు.
ఇదీ చదవండి: బాలుడి అద్భుత బ్యాటింగ్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఫిదా