Bhubaneswar Child Paintings: ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రెండున్నరేళ్ల అన్వీ విశేష్ అగర్వాల్.. రికార్డుల మోత మోగిస్తోంది. అతి చిన్న వయసులోనే 37కు పైగా కళాత్మక పద్ధతుల్లో పెయింటింగ్‌లు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన బుల్లి చేతులతో వివిధ రకాల రంగులను ఉపయోగించి అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తోంది. పెండ్యులం పెయింటింగ్, చక్రాలకు రంగులు వేయటం, ప్రతిబింబం చిత్రాలు, బబుల్ పెయింటింగ్.. ఇలా ఎన్నో రకాల పద్ధతులతో చిత్రాలను అలవోకగా వేసేస్తోంది. తన కళాత్మక నైపుణ్యంతో అన్వీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు, లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును సైతం బాలిక సొంతం చేసుకుంది.
"72 చిత్రాలకు అవార్డులు వచ్చాయి. నిజానికి తను(అన్వీ) వందకు పైగా కళాఖండాలను గీసింది. కానీ మేము 72 మాత్రమే రికార్డు చేశాం. తను(అన్వీ) విభిన్న పద్దతుల్లో చిత్రాలను గీస్తుంది. పెయింటింగ్‌ను ఎప్పుడు ప్రారంభించాలి, తిరిగి ఎప్పుడు ముగించాలి అనేది అన్వీనే నిర్ణయిస్తుంది. పెండ్యులం పెయింటింగ్‌కు తను 5నిమిషాల సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది. సగటున వారానికి 8-9గంటల సమయాన్ని పెయింటింగ్ కోసం వినియోగిస్తుంది. 9 నెలల వయసు నుంచి ఇప్పటివరకు 200 పైగా గంటలు పెయింటింగ్ కోసం కేటాయించింది."
-అనురాధ, బాలిక తల్లి
Toddler painting Records: కేవలం చిత్రకళకే పరిమితం కాకుండా మిగతా వాటిల్లోనూ ప్రతిభ చాటేందుకు అన్వీ కృషి చేస్తోంది. 9నెలల వయసు నుంచే అన్వీ స్పానిష్ పదాలను నేర్చుకోవడం ప్రారంభించింది. అలాగే పాటలు, నృత్య తరగతులకు సైతం హాజరవుతూ అందులోనూ నైపుణ్యం పెంచుకుంటోంది. కరోనాతో దొరికిన ఖాళీ సమయం అన్వీతో గడిపేందుకు ఉపయోగపడిందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అన్వీ ఆసక్తిని కనుగొని ఆ దిశగా ప్రోత్సహించే అవకాశం దొరికిందని పేర్కొన్నారు. తన ప్రతిభతో ఎంతో మంది చిన్నారులకు ప్రేరణగా నిలుస్తున్న అన్వీని చూసి గర్విస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు.. 8.36 సెకన్లలో 100 మీటర్లు!