IPS officer IT raids: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రామ్ నారాయణ్ సింగ్ ఇంటి బేస్మెంట్లో కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. నోయిడా సెక్టార్ 50లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బేస్మెంట్ నుంచే ఓ సంస్థను నడిపిస్తున్నట్లు కనుగొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ కంపెనీకి 650 లాకర్లు ఉన్నాయని పేర్కొన్నాయి.
![Noida IPS officer IT raids premises of his house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gbn-01-it-read-vis-dl10007_30012022230828_3001f_1643564308_686.jpg)
650 lockers in Basement
ఇప్పటివరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి సోదాలు మాత్రమే నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. బినామీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించాయి.
సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇంట్లో నుంచి రికవరీ చేసుకున్న నగదు వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: తాను ఓడినా.. శత్రువు గెలవొద్దు.. యూపీలో 'మాయా' స్కెచ్!