దేశంలో అక్రమంగా నివసిస్తున్న తొమ్మిది మంది వలసదారులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు ఠాణె జిల్లా భివండి మండల పరిధిలోని సారావలి గ్రామంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అవని టెక్స్‌టైల్ కంపెనీలో పనిచేస్తున్న నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారందరూ బంగ్లాదేశ్‌కు చెందినవారిగా(Bangladesh immigrants in India) గుర్తించారు.
ప్రధాన నిందితుడు, బంగ్లాదేశ్‌కు చెందిన సలీం అమీన్ షేక్ అలియాస్ అస్గర్.. గడిచిన 16 ఏళ్లుగా భివండి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో పని కోసం మరి కొంతమందిని అక్కడకు తీసుకొచ్చినట్లు తెలిపారు. నిందితులపై భారతీయ పాస్‌పోర్ట్ చట్టం, విదేశీయుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రూ.50వేల కోసం వేధింపులు.. నవవధువు బలవన్మరణం