Naxalites Luxury Life: సాధారణ ప్రజల పేరుతో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న నక్సలైట్లు ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఝార్ఖండ్ రాంచీలో ముగ్గురు నక్సలైట్ల అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రాంచీలో ఓ హోటల్‌పై దాడి చేసి ముగ్గురు పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎల్ఎఫ్ఐ) నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కార్లు, రూ.3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులను బెదిరించి వసూలు చేసిన సొమ్ముతో వారు ఈ వాహనాలు కొనుగోలు చేశారని రాంచీ ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా తెలిపారు. పీఎల్ఎఫ్ఐ బలోపేతానికి ఈ ముగ్గురు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. విలాస కార్ల ద్వారా మందుగుండు సామగ్రి, ఇతర పేలుడు పదార్ధాలను రవాణా చేస్తున్నట్లు వివరించారు.
అరెస్టయిన ముగ్గురు నక్సలైట్లను అమీర్‌చంద్ కుమార్, ఆర్య కుమార్‌సింగ్, ఉజ్వల్ కుమార్ సాహుగా గుర్తించారు.
ఇదీ చదవండి: భాజపా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఏమైందంటే?