ETV Bharat / bharat

నాలుగోసారి పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్​ రంగస్వామి నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షాలు తెలిపారు. 30 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఎఐఎన్ఆర్​సీ 10, భాజపా 6 స్థానాలు కైవసం చేసుకుని మ్యాజిక్​ ఫిగర్​ను అందుకున్నారు.​

author img

By

Published : May 7, 2021, 3:42 PM IST

N Rangasamy, Puducherry Chief Minister
ఎన్​ రంగస్వామి ప్రమాణస్వీకారం

ఆల్​ ఇండియా నేషనల్​ రీజినల్​ కాంగ్రెస్​ పార్టీ(ఏఐఎన్​ఆర్​సీ) అధినేత ఎన్​ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టడం ఆయనకు ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సరైన పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్​ 6న ఎన్నికలు జరిగాయి. ఎఐఎన్​ఆర్​సీ, భాజపా కలిసి ఎన్డీఏగా బరిలోకి దిగి 16 స్థానాలు కైవసం చేసుకున్నాయి. వాటిలో రంగస్వామి పార్టీ 10 సీట్లు, కమలం పార్టీ 6 సీట్లు గెలుపొందాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్​ను అందుకున్నాయి. అధికార కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితం కాగా, డీఎంకే 6 స్థానాల్లో గెలిచింది.

N Rangasamy, Puducherry Chief Minister
ఎన్​ రంగస్వామి ప్రమాణస్వీకారం
N Rangasamy, Puducherry Chief Minister
ఎన్​ రంగస్వామి ప్రమాణస్వీకారం

నాలుగోసారి..

కాంగ్రెస్​లో ఉన్నప్పుడు 2001 నుంచి 2008 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు రంగస్వామి. ఆ తర్వాత 2011లో హస్తం పార్టీని వీడి బయటకొచ్చి ఏఐఎన్​ఆర్​సీ పార్టీని స్థాపించారు. మూడు నెలల్లోనే తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. 2011నుంచి 2016వరకు సీఎంగా ఉన్నారు. 2016లో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. తాజాగా ఆ కూటమిని ఓడించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని రంగస్వామి అధిరోహించారు.

ఇదీ చూడండి: ఆ ఫైల్​పై సీఎంగా స్టాలిన్ తొలి సంతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.