ETV Bharat / bharat

ముస్లిం విద్యార్థికి సంస్కృతంలో ఐదు మెడల్స్​- శ్లోకాలు, పద్యాల్లో దిట్ట

Muslim Girl Medals In Sanskrit: ఆమె ఓ ముస్లిం విద్యార్థిని. అయినా భారతీయ ప్రాచీన భాష అయిన సంస్కృతంలో దిట్ట. ఎంఏ సంస్కృతం విభాగంలో యూనివర్సిటీలోనే టాప్. సంస్కృతంలో ఆమెకున్న పట్టుకు ఏకంగా ఐదు పతకాలు ఆమెను వరించాయి. అంతేకాదు సంస్కృతంలో శ్లోకాలు, పద్యాలు సునాయాసంగా చెప్పగలదు.

author img

By

Published : Feb 11, 2022, 3:50 PM IST

Muslim Girl Medals In Sanskrit
ముస్లిం విద్యార్థిని సంస్కృతంలో ఐదు మెడల్స్

Muslim Girl Medals In Sanskrit: ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముస్లిం విద్యార్థిని గజాలా ఎంఏ సంస్కృతం విభాగంలో విశ్వవిద్యాలయంలోనే ఉత్తమ విద్యార్థినిగా నిలిచింది. సంస్కృతంలో ఏకంగా ఐదు పతకాలు సాధించింది. లఖ్​నవూ యూనివర్సిటీ(ఎల్​యూ) డీన్​ ప్రొ. శశి శుక్లా.. గజాలాకు మెడల్స్ అందజేశారు. గజాలాకు కేవలం సంస్కృతంలోనే కాదు.. ఆంగ్లం​, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషల్లోనూ మంచి పట్టుంది.

వారివల్లే ఈ పతకాలు

చిన్నవయసులోనే తండ్రి చనిపోవడం వల్ల గజాలాకు అన్నీ తామై పెంచారు సోదరులు షాదాబ్​, నయాబ్.

"ఈ పతకాలు నేను గెలుచుకోలేదు. నా సోదరులు సాధించారు. షాదాబ్, నయాబ్ చిన్న వయసులోనే పాఠశాలకు వెళ్లడం మానేసి గ్యారేజీలో పనిచేస్తూ నన్ను చదివించారు." అని గజాలా భావోద్వేగానికి గురైంది. గజాలా సోదరి ఓ దుకాణంలో పనిచేస్తుండగా.. తల్లి నజ్రీన్​బానో ఇల్లు చూసుకుంటోంది.

రోజుకు 7గంటలు సంస్కృతం పఠనం..

గజాలా తన కుటుంబంతో కలిసి లఖ్​నవూలో ఉంటోంది. రోజుకు ఏడు గంటలపాటు సంస్కృతం పఠిస్తోంది. సంస్కృతంలో ప్రొఫెసర్ కావాలన్నదే తన కల అంటోంది గజాలా. క్యాంపస్​లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా గజాలా పాల్గొంటుంది. సంస్కృతంలో శ్లోకాలు, గాయత్రి మంత్రం, సరస్వతి వందనం లాంటి భక్తి శ్లోకాలు స్టేజీపై పఠిస్తుంది.

అన్ని భాషలకు అమ్మ సంస్కృతం..

"దేవుడి సొంత భాష సంస్కృతం. ఇది అన్ని భాషలకు అమ్మ వంటిది. సంస్కృతంలో పద్యాలు, కవిత్వం వినసొంపుగా ఉంటాయి. 5వ తరగతిలోనే పాఠశాలలో సంస్కృతం నేర్చుకున్నా. ముస్లిం అయి ఉండి సంస్కృతంలో పట్టుసాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. " అని గజాలా తెలిపింది.

ప్రస్తుతం తనకు వైదిక సాహిత్యంలో పీహెచ్​డీ చేయాలని ఉందని వెల్లడించింది గజాలా.

ఇదీ చూడండి: క్రికెట్​ బాల్​ కోసం భారీ ఫైట్.. రోడ్డుపై కర్రలు, రాళ్లతో కొట్టుకుంటూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.