ETV Bharat / bharat

పబ్​జీకి బానిసై.. తల్లి బ్యాంక్​ ఖాతా నుంచి రూ.10లక్షలు...

ముంబయిలోని ఓ 16ఏళ్ల బాలుడు పబ్​జీకి(pubg news today) బానిసై.. ఆన్​లైన్​ గేమ్​ కోసం తల్లి బ్యాంక్​ ఖాతా నుంచి రూ.10లక్షలు ఖర్చుపెట్టాడు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలుడిని మందలించారు. చివరకు 'ఇక ఇంటికి నేను తిరిగిరాను' అని ఆ బాలుడు లేఖ రాసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

pubg
పబ్​జీ
author img

By

Published : Aug 28, 2021, 7:42 PM IST

దేశంలో 'పబ్​జీ' సమస్యలు మళ్లీ పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి యువత వరకు చాలా మందికి పబ్​జీ(pubg mobile india) ఓ వ్యసనంగా మారిపోయింది. ఆ మాయలో పడి.. ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. తాజాగా.. పబ్​జీ కోసం ఓ 16ఏళ్ల బాలుడు.. తన తల్లి బ్యాంక్​ ఖాతా నుంచి ఏకంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టాడు. విషయం తెలుసుకున్న ఆ తల్లి మందలించేసరికి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

మహారాష్ట్ర ముంబయిలోని జాగేశ్వరి ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాలుడు పబ్​జీకి(pubg news today) బానిసైపోయాడు. ఆట కొనసాగాలన్న, ప్లేయర్ల ప్రదర్శన మెరుగ్గా ఉండాలంటే గేమ్​లో కొన్ని ఫీచర్స్​(ఆయుధాలు వంటివి) కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ బాలుడు తల్లి బ్యాంక్​ ఖాతా నుంచి డబ్బులు తీశాడు. ఇదేంటని తల్లిందడ్రులు తిట్టేసరికి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగిరానని లేఖ కూడా రాశాడు.

ఈ వ్యవహారాన్ని అంధేరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఆ 16ఏళ్ల బాలుడు అంధేరీ ఈస్ట్​ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే అతడ్ని పట్టుకుని, కౌన్సిలింగ్​ ఇచ్చి.. తల్లిదండ్రులకు అప్పగించారు.

pubg
బాలుడికి పోలీసులు కౌన్సిలింగ్​

మధ్యప్రదేశ్​లోనూ...

ఫ్రీఫైర్​ ఆన్​లైన్​ గేమ్(free fire game online)​ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు.. మరో ఇద్దరు మైనర్లకు ఆ ఆన్​లైన్​ గేమ్​ను పరిచయం చేశారు. అది కాస్తా వారికి వ్యసనంగా మారింది. ఆ తర్వాత.. ఆ యువకులు వారి నుంచి రూ. 75వేలు దోచుకున్నారు.

ఆన్​లైన్​ గేమ్​కు డబ్బులు కట్టాలని చెప్పి.. మైనర్లకు ఆ యువకులు దొంగతనం కూడా నేర్పించారు. ఆ మైనర్లలో ఒకరు తండ్రి జేబులోంచి డబ్బులు దొంగలించడం మొదలుపెట్టారు. అలా.. వారు దోచుకున్న ఆ డబ్బులను ఆ యువకులు కత్తులు, తుపాకులు చూపించి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ మైనర్లలో ఒకరి తండ్రి ఖర్గోన్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- బాలుడి చేతికి ఫోన్- లక్షల కారు అమ్ముకున్న తండ్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.