ETV Bharat / bharat

'సమాజ్​వాదీ'కి ఎదురుదెబ్బ.. భాజపాలోకి ములాయం కోడలు! - Mulayam daughter in law BJP

Mulayam daughter in law BJP: ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు భాజపాలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో భాజపా విధానాలను వెనకేసుకొస్తున్న అర్పనా సింగ్.. కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

aparna yadav bjp
aparna yadav bjp
author img

By

Published : Jan 16, 2022, 2:05 PM IST

Mulayam daughter in law BJP: సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు భాజపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ ఈ మేరకు కమలం తీర్థం పుచ్చుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే సమాజ్​వాదీ పార్టీకి కొంతమేర ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

Aparna Yadav joining BJP

2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు అర్పనా సింగ్. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అయితే, ఇటీవలి కాలంలో భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఊపందుకుంది.

భాజపాకు బూస్ట్!

గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణా యాదవ్ చేరిక.. భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్​పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం.. భాజపాకు లాభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

UP Election 2022

రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి సమాజ్​వాదీ పార్టీలో చేరారు. బీసీ ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చిందని, ఇన్నేళ్లయినా ఆ వర్గాన్ని పట్టించుకోలేదని ఈ మేరకు ఆరోపించారు.

ఇదీ చదవండి: ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీకి సీఎం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.