కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై ఎంపీ కోటా సీట్లను రద్దు చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించింది కేవీఎస్. ఈ కోటాలో సీట్ల సంఖ్యను మరింత పెంచాలని ఎంపీలు గతకొంతకాలంగా డిమాండ్లు చేస్తున్న తరుణంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎంపీలతో పాటు ఇతర కోటాల కింద సీట్లను భర్తీ చేసే ప్రక్రియను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: యువజంట ప్రేమ వివాహం.. రాష్ట్రమంతా దుమారం.. అసలేమైంది?