మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇంటికి తరచూ (crime news latest updates) వస్తున్నాడని బావనే హత్య చేశాడో యువకుడు. ఈ ఘటన బైతూల్ జిల్లా, బిచుయా గ్రామంలో జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని హిరవాడి గ్రామానికి చెందిన వినోద్ పండ్రే(32).. దీపక్ కుమార్(25) సోదరిని వివాహం చేసుకున్నాడు. దీపక్ తల్లిదండ్రులతో పాటే నివసిస్తాడు. పెళ్లి అనంతరం సోదరి భర్తతో కలిసి తరచూ పుట్టింటికి వస్తుండేది. ఇది దీపక్‌కు నచ్చలేదు. తన ఇంటికి రాకూడదంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవల సోదరి, బావ ఇంటికి రావడంపై గొడవకు దిగాడు దీపక్. ఈ ఘర్షణలో పండ్రేను కర్రతో బాది చంపేశాడు దీపక్. మధ్యలో కల్పించుకున్న అతని తల్లిని కూడా తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.