ETV Bharat / bharat

రూ. కోటి బీమా కోసం.. చనిపోయినట్లుగా నమ్మించి.. - నకిలీ మరణ ధ్రువపత్రాలు తాజా వార్తలు

రూ. కోటి బీమా కోసం తాను చనిపోయినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. ప్రయత్నం విఫలమై పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Man fakes
రూ. కోటి బీమా కోసం
author img

By

Published : Nov 8, 2021, 5:02 PM IST

తాను చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. రూ. కోటి బీమా పొందేందుకు యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. దీనికి కుటుంబంతో పాటు ఓ వైద్యుడి సహకారం తోడైంది. చివరకు అసలు విషయం బయటపడగా... పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

ఏం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్​, దేవాస్​కు చెందిన హనీఫ్(46).. 2019, సెప్టెంబర్​లో ఓ కంపెనీ నుంచి రూ. కోటి బీమా కవర్​ తీసుకున్నాడు. రెండు వాయిదాలు కట్టిన తర్వాత.. డాక్టర్. షకీర్ మన్సూరి అనే వైద్యుడి సాయంతో.. హనీఫ్​ మృతిచెందినట్లుగా నకిలీ మరణపత్రాన్ని రూపొందించారు. హనీఫ్ మరణపత్రంతో అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్​ రూ. కోటి బీమా క్లెయిమ్ చేసుకునేందుకు దరఖాస్తు పెట్టారు.

ఇదే వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన సదరు కంపెనీ.. దేవాస్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో హనీఫ్ సజీవంగానే ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

నవంబర్​ 7న ఫోర్జరీ కేసులో భాగంగా.. హనీఫ్​, అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్​తోపాటు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించిన వైద్యుడు షకీర్ మన్సూరిని అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్. షకీర్ వైద్యడిగ్రీపైనా విచారణ చేస్తున్నట్లు దేవాస్ స్టేషన్​ ఇంఛార్జ్​ ఉమ్రావ్ సింగ్ తెలిపారు.

ఇదీ చూడండి: వలంటీర్​ అరాచకం- చోరీ ఆరోపణతో యువకుడిపై కిరాతకంగా దాడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.