ETV Bharat / bharat

కాంక్రీట్ మిక్సర్, జేసీబీలతో పిండి కలిపి ప్రసాదం తయారీ.. అంతా టన్నుల్లోనే!

అక్కడ జేసీబీ వాహనాలు ఉంటాయి.. కానీ మట్టి తోడటం వాటి పని కాదు! కాంక్రీటు మిక్సింగ్ వాహనాలు ఉంటాయి... కానీ అక్కడేమీ స్లాబ్ పని జరగడం లేదు! పదుల సంఖ్యలో జనాలు, భారీ ట్రాలీలు ఉండటాన్ని చూసి.. అక్కడేదో నిర్మాణ పనులు జరుగుతున్నాయనిపిస్తుంది. కానీ, అదేం కాదు! ఆ హడావుడి అంతా వంటల కోసమే!!

jcb-used-for-make-prasad
jcb-used-for-make-prasad
author img

By

Published : Nov 17, 2022, 3:47 PM IST

జేసీబీ, కాంక్రీట్ మిక్సర్​తో ప్రసాదం తయారీ

40 టన్నుల పిండి.. వందల కిలోల బెల్లం.. క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు.. రాష్ట్రంలోనే అతిపెద్ద వంట పాత్రలు.. మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని దంద్రౌవా ధామ్​కు వచ్చే భక్తుల కోసం వంటలు చేసే ప్రాంతంలో పరిస్థితి ఇది.
ఈ క్షేత్రానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారందరికీ సరిపోయే విధంగా వంటలు చేసేందుకు ఏకంగా భారీ యంత్రాలనే ఉపయోగిస్తుంటారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పాత్రలను ఇక్కడ వంటలు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. వంటకాలను కలపడం, ఇతర పాత్రల్లోకి మార్చడం వంటి పనుల కోసం జేసీబీని ఉపయోగిస్తున్నారు.

దంద్రౌవా ధామ్ స్థానికంగా చాలా ఫేమస్. గ్వాలియర్, చంబల్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు. హనుమంతుడికి ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడి దేవుడిని డాక్టర్ హనుమాన్ అని కూడా పిలుస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు హనుమాన్ కథలు చెబుతుంటారు. ప్రముఖ కథకుడు ధీరేంద్ర కుమార్ శాస్త్రి.. తాజాగా ఇక్కడికి వచ్చి కథలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు దంద్రౌవా ధామ్​కు తరలివస్తున్నారు. వీరికి ప్రసాదం సరఫరా చేసేందుకే ఈ స్థాయిలో వంటలు చేస్తున్నారు.

jcb-used-for-make-prasad
భారీ వంట పాత్ర

మానవ శ్రమను తగ్గించి, వేగంగా వంటలు చేసేందుకు భారీ యంత్రాలు వినియోగిస్తున్నారు ఇక్కడి నిర్వాహకులు. అతిపెద్ద పాత్రలో కూరగాయలు వండుతారు. పిండి కలిపేందుకు కాంక్రీటు మిక్సర్​ను ఉపయోగిస్తారు. ఇక్కడ వినియోగించే ఓ పాత్ర రాష్ట్రంలోనే అతిపెద్దది కావడం విశేషం.

jcb-used-for-make-prasad
వంటలు చేస్తున్న సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.