ETV Bharat / bharat

'మా ఇంటికి కృష్ణుడొచ్చాడు!'.. జన్మాష్టమి రోజున వందలాది డెలివరీలు.. ఆస్పత్రుల్లో సంబరాలు - జన్మాష్టమి రోజున బీహర్​లో వందలాది డెలివరీలు

More than 500 Babies Born on Shri Krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ బిహార్​లోని వందలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. పండుగ రోజున బిడ్డలు పుట్టగా.. ఆ వెన్నదొంగే తమ ఇంటికి వచ్చాడంటూ తల్లిదండ్రులు, బంధువులంతా సంతోషంలో మునిగితేలుతున్నారు. ఫలితంగా ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సందడి వాతావరణం నెలకొంది.

more-than-500-babies-born-on-shri-krishna-janmashtami-in-bihar
బీహర్​లో జన్మాష్టమి రోజున వందలాది డెలివరీలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 8:15 AM IST

More than 500 Babies Born on Shri Krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బిహార్​లో వందలాది మంది మహిళలు ప్రసవించారు. వీరిలో కొందరు పండుగ రోజునే బిడ్డను కనడం యాదృచ్ఛికం కాగా.. మరికొందరు 6, 7 తేదీల్లోనే ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారట! ఇలా బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బిహార్​లోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 500 మందికిపైగా మహిళలు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇందులో 150 మంది రాజధాని పట్నాలోనే ఉన్నారు. బిహార్​లో రోజంతా జరిగిన ప్రసవాలతో కలిపితే ఈ సంఖ్య 1000 దాటుతుందని వైద్యులు అంటున్నారు.

పండుగ రోజున తమ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాకతో తల్లిదండ్రులు, బంధువులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఫలితంగా బిహార్​లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోలాహలం నెలకొంది.

ముహూర్తం పెట్టి మరీ..
శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ప్రసవం జరిగితే బాగుంటుందని అనేక మంది భావిస్తుంటారు. కొందరు ఇందుకోసం వైద్యులపై ఒత్తిడి కూడా తెస్తుంటారు. ఈసారి కూడా అలానే జరిగిందని పట్నాకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్. సారికా రాయ్ తెలిపారు.

"హిందువులు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. అలా జరిగితే భగవంతుడి ఆశీస్సులు లభించాయని అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలతో.. 4-5రోజులు ముందు లేదా ఆలస్యంగా ప్రసవం జరిగేలా చేయొచ్చు. కానీ.. డెలివరీకి ఇంకా 10-15రోజులు సమయం ఉన్నా.. కొందరు పండుగ రోజే ప్రసవం చేయాలని కోరారు. మేము అందుకు ఒప్పుకోలేదు. గర్భంలోని శిశువు పరిస్థితి చూశాకే ప్రసవం ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తాం. ముందస్తు డెలవరీలు చేయం." అని చెప్పారు డాక్టర్ సారికా రాయ్.

ఇంతకీ పండుగ ఏరోజు?
శ్రీకృష్ణ జన్మాష్టమి ఏరోజు అనేదానిపై కాస్త గందరగోళం నెలకొంది. కొందరు బుధవారం (6వ తేదీ) పండుగ జరుపుకోగా మరికొందరు గురువారం చేసుకుంటున్నారు. ఇదే విషయంలో అనుమానంతో ఓ మహిళ ప్రత్యేక 'డిమాండ్​' చేశారని చెప్పారు డాక్టర్ సారికా రాయ్.

"కచ్చితంగా బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రసవం చేయాలని ఓ మహిళ డిమాండ్ చేశారు. ఆమెకు ఔషధాలు ఇచ్చి.. పరిస్థితి స్థిరంగా ఉండేలా చూస్తున్నాం. రాత్రి 11.15 గంటలకు లేబర్ రూమ్​కు తీసుకెళ్లి.. కచ్చితంగా 12 గంటలకు ప్రసవం జరిగేలా చూస్తాం. బిడ్డ పుట్టినరోజును సెప్టెంబర్​ 6న జరుపుకోవాలా లేక 7వ తేదీన చేసుకోవాలా అనేది కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు" అని బుధవారం మీడియాకు చెప్పారు డాక్టర్ సారికా రాయ్.

దేశవ్యాప్తంగా పండుగ సందడి..
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందడి నెలకొంది. వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేక అలంకరణలు, పూజలు, భక్తులతో కళకళలాడుతున్నాయి.

Sonia Gandhi Letter To Modi : 'అజెండా చెప్పకుండా పార్లమెంటు సమావేశాలా?.. ఈ 9 అంశాలపై చర్చించండి!'

Gold Utensils For G20 : అతిథిదేవో భవ! జీ20 దేశాధినేతలకు బంగారు పాత్రల్లో విందు.. చూస్తే ఔరా అనాల్సిందే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.