ETV Bharat / bharat

బాలికపై అత్యాచారం.. కాపాడాల్సింది పోయి వాళ్లు కూడా..! - అత్యాచారం

ఓ 15ఏళ్ల మైనర్​పై కాలేజీలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను మరో నలుగురు చిత్రీకరించారు. వారి నుంచి తప్పించుకున్న మైనర్​.. సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీసింది. అక్కడే ఉన్న రైతు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

rape victim news
అత్యాచారం
author img

By

Published : Nov 11, 2021, 8:19 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన బయటకొచ్చింది. బాగ్​పత్​లో ఓ 15ఏళ్ల మైనర్​పై ఆమె చదువుకుంటున్న కాలేజీకి చెందిన ఇద్దురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 9న.. నిందితులు బాధితురాలి ఇంటి దగ్గరికి వెళ్లి ఆమెను పిలిచారు. ముగ్గురు కలిసి కాలేజీకి వెళ్లారు. అక్కడే ఆమెపై ఆ ఇద్దరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇంతలో మరో నలుగురు అక్కడి వెళ్లారు. అత్యాచారాన్ని ఆపి బాధితురాలని రక్షించకుండా.. ఆ ఘటనను ఫొటోలు, వీడియోలు తీశారు. వారు కూడా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. సమీపంలోని పొలంలోకి పరుగులు తీసింది. సహాయం కోసం ఎదురుచూసింది. అక్కడ ఓ రైతు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న మైనర్​ను చివరికి పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. ఇద్దరిని జువనైల్​ హోంకు తరలించారు.

బిహార్​లో..

బిహార్​ నలందాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 23ఏళ్ల యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఛత్త్​ పూజ సందర్భంగా.. మంగళవారం నాడు బాధితురాలు తన మిత్రుడితో కలిసి ప్రసాదం కోసం గుడికి వెళ్లింది. తర్వాత ఇద్దరు కలిసి చండి-సమర రాష్ట్ర రహదారి 78 వద్ద ఓ చోట కూర్చును తిన్నారు. అప్పుడే నలుగురు దుండగులు వచ్చి వారితో అసభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాధితురాలి మిత్రుడిని కత్తితో బెదిరించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో తేలినట్టు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

అయితే ఈ వ్యవహారంలో బాధితురాలి మిత్రుడి పాత్ర కూడా ఉందని ఆమె తల్లి ఆరోపించింది. అతడే, తన ఇతర మిత్రులతో కలిసి ఈ నేరానికి పాల్పడినట్టు వెల్లడించింది.

ఆ బాలికకు న్యాయం..

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​లో ఐదేళ్ల క్రితం ఓ 15ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి.. ప్రత్యేక పోక్సో కోర్టు తాజాగా 12ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషి జహిద్​కు రూ.50వేల జరిమానాను విధించింది. 2016జులై 19న బాధితురాలని జహిద్​ తన గ్రామం నుంచి అపహరించి దిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడే ఓ గదిలో పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జహిద్​తో పాటు మరో ఇద్దరిపైనా పోలీసులు ఆనాడు అరెస్ట్​ చేశారు. వారిద్దరిపై జువనైల్​ కోర్టులో విచారణ జరుగుతోంది.

మధ్యప్రదేశ్​లో..

2020లో మధ్యప్రదేశ్​ ఉజ్జెయిన్​లోని ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన రాహుల్​ ఫులారియాకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ప్రత్యేక పోక్సో కోర్టు. రూ. 3వేల జరిమానా విధించింది.

ఇదీ జరిగింది..

తాను బయటకి వెళ్లి తిరిగొచ్చేసరికి.. తన కూతురు కనిపించలేదని బాధితురాలి తల్లి 2020 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలి ఆచూకీని కనుగొన్నారు. షాజాపుర్​లోని నిందితుడి నివాసంలో ఆమెను రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలు మాట మార్చేసింది. పోలీసులకు సహకారం అందిచడం ఆపేసింది. కేసులో ముందుకెళ్లడం కోసం బాధితురాలు, నిందితుడికి డీఎన్​ఏ పరీక్షలు చేయించారు పోలీసులు. ఫలితాల్లో ఆమె మైనర్​ అని తేలింది. చివరికి రాహుల్​కు కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదీ చూడండి:- వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.