ETV Bharat / bharat

ఉగ్రవాద అనుకూల మార్గాలను మూసివేయాలి : మోదీ

ఉగ్రవాదులు, అవినీతిపరులు, నేరస్థులకు అనుకూలమైన అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దిల్లీలోని ప్రగతి మైదాన్​లో జరిగిన ఇంటర్‌పోల్ 90వ సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించారు.

interpol conference 2022
modi at 90 th interpol conference
author img

By

Published : Oct 18, 2022, 6:11 PM IST

Interpol conference 2022 : ఉగ్రవాదులు, అవినీతిపరులు, నేరస్థులకు అనుకూలమైన అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందుకోసం అంతర్జాతీయ సమాజం మరింత వేగవంతంగా, కలిసి కట్టుగా పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దిల్లీలో ఇంటర్‌పోల్‌ 90వ జనరల్‌ సమావేశాలను ప్రారంభించిన ఆయన.. దుష్ట శక్తుల ఆట కట్టించాలంటే మంచి శక్తులు కలిసి పని చేయాలని వివరించారు.

ఉగ్రవాదం, డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, వ్యవస్థీకృత నేరాలు మానవాలిని పీడిస్తున్న ప్రధాన సమస్యలని మోదీ అన్నారు. అవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదనీ వాటికి అన్ని దేశాల్లో గట్టి పునాదులు కలిగి ఉన్నాయన్నారు. ఆ నెట్వర్క్‌ను ఎదుర్కోడానికి లోకల్‌గా తీసుకునే చర్యలు ఏమాత్రం సరిపోవని తెలిపారు. ఉగ్రవాదం లాంటి పెనుభూతాన్ని భూస్థాపితం చేయాలంటే దేశాలన్నీ ఏకతాటి పైకి రావాలని వివరించారు. ఇంటర్‌పోల్‌ 90వ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకునే మోదీ వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు.

ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వని ఎఫ్​ఐఏ డైరక్టర్​ జనరల్​..
దిల్లీలో జరిగిన ఇంటర్‌పోల్ సదస్సుకు హాజరైన పాకిస్థాన్​ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ బట్​.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను భారత్‌కు అప్పగిస్తారా అని అడగగా.. దానికి ఆయన బదులు చెప్పలేదు.

ఇదీ చదవండి: ఏడాది చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు.. వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కుతిని...

బరువు తగ్గి రూ.2,300 కోట్లు రాబట్టిన ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.