Tremors felt in Karnataka: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సుళ్యా తాలుకాలో ఉదయం 9:10 నిమిషాలకు భారీ శబ్దాలతో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 45 సెకన్ల పాటు కంపించినట్లు చెప్పారు. సుళ్యా సహా కల్లుగుండి, సంపాజే, గూండ్కా, అరంతోడు, ఇవర్నాడు, తోడిక్కన ప్రాంతాల్లో ప్రకపంనలు సంభవించాయి.
రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సుళ్యా ప్రాంతాల్లోని అనేక ఇళ్లు బీటలువారాయి. ఆందోళన చెందిన ప్రజలు.. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులన్నీ నేలపై పడిపోయాయి. ఈ ఘటనపై ప్రజలు తమకు సమాచారం అందించారని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి: ప్రయాణిస్తుండగానే బైక్‌లో చెలరేగిన మంటలు.. రైడర్ సజీవదహనం