ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ.. ఎమ్మెల్యేలంతా భాజపా కూటమిలోకి!

Meghalaya Congress News: మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. ఆ పార్టీకి ఇప్పటివరకు మిగిలి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. భాజపాతో కూడిన అధికార ఎండీఏలో చేరాలని నిర్ణయించుకున్నారు.

meghalaya congress news
మేఘాలయాలో కాంగ్రెస్
author img

By

Published : Feb 8, 2022, 4:15 PM IST

Updated : Feb 8, 2022, 5:21 PM IST

Meghalaya Congress News: మేఘాలయలో కాంగ్రెస్​కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలోని ఐదుగురు ఎమ్మెల్యేలు కాన్రాడ్​ కే సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్​ అలయన్స్​ (ఎండీఏ)లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మాకు లేఖ అందజేశారు.

కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అంపరీన్ లింగ్​డో, మేరాబోర్ సీయం, మోహెన్డ్రో రాప్​సాంగ్, కిమ్​ఫా మార్బనియాంగ్​, పీటీ సాక్మి ఎండీఏలో చేరుతున్నట్లు లేఖ ద్వారా వెల్లడించారు. ఇదే లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా పంపారు.

meghalaya congress news
ఐదుగురు ఎమ్మెల్యేల లేఖ

" మేఘాలయ డెమొక్రటిక్ కూటమిలో చేరాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. మా మద్దతుతో ఎండీఏ మరింత బలపడుతుందని, రాష్ట్రాన్ని ముందుకుతీసుకెళ్తుందని, ప్రజల ఆశయాలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం." అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్​లోని ఎమ్మెల్యేలంతా ఎండీఏలో చేరడం వల్ల.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షం అయింది.

2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు మరణించడం వల్ల ఉపఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆ రెండు స్థానాలను నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) కైవసం చేసుకుంది.

గతేడాది 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. ఇప్పుడు మిగిలి ఉన్న ఐదుగురు ఎండీఏలోకి వెళ్తున్నారు.

2023లో మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'రైతులకు ఉచిత కరెంట్.. 'లవ్ జిహాద్' దోషులకు పదేళ్లు జైలు'

Last Updated : Feb 8, 2022, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.