ETV Bharat / bharat

Meerut Police Pistol Case : 'బైక్​లో పోలీసులే గన్​ పెట్టి.. చెకింగ్​ పేరుతో యువకుడి అరెస్ట్​.. సీసీటీవీలో అసలు విషయం' - ఉత్తర్​ప్రదేశ్ మీరఠ పోలీసులు కేసు

Meerut Police Pistol Case : భూవివాదంలో యువకుడిని ఇరికించేందుకు ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​ పోలీసులు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. యువకుడి బైక్​లో పిస్టల్​ను పోలీసులే ఉంచి.. ఆపై దానిని స్వాధీనం చేసుకున్నట్లు నటించి అతడిని అరెస్ట్​ చేసినట్లు బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Meerut Police Pistol Case
Meerut Police Pistol Case
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 10:18 AM IST

Meerut Police Pistol Case : ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​ పోలీసులుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడిని ఇరికించేందుకు అతడి బైక్​లో పిస్టల్​ను పోలీసులే కావాలనే ఉంచారని కొందరు మహిళలు ఆరోపించారు. అనంతరం ఆ పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నట్లు నటించి యువకుడిని అరెస్ట్​ చేశారని ఆరోపణలు చేశారు. అసలేమైందంటే?

జిల్లాలోని ఖర్ఖోడా పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఖండ్రవలి గ్రామానికి చెందిన కొందరు మహిళలు.. ఐజీ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి పోలీసులు తమ ఇంటికి చేరుకున్నారని మహిళలు తెలిపారు. బైక్ బ్యాగ్​లో ఓ పోలీస్​ కావాలనే ఏదో ఉంచి ఇంట్లో నిద్రిస్తున్న తమ కుటుంబ సభ్యుడు అంకిత్​ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. యువకుడిని ఇరికించేందుకే చేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు చేశారు.

Meerut Police Pistol Case
ఐజీకి చూపించిన సీసీటీవీ ఫుటేజ్​లోని దృశ్యం

Meerut Police Conspiracy : "పోలీసులు మంగళవారం రాత్రి ముందుగా మా ఇంటికి చేరుకున్నారు. మేము నిద్రిస్తున్న సమయంలో ఇంటి బయట ఉన్న బైక్​ బ్యాగ్​లో పిస్టల్​ను ఉంచారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీయగా.. ఇంట్లోకి వెళ్లి అంకిత్​ను అదుపులోకి తీసుకున్నారు. మేం చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. మాపై దుర్భాషలాడారు" అని అంకిత్​ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఘటనానంతరం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను గమనించామని.. అందులో పోలీసులే బైక్​లో పిస్ట​ల్​ను పెట్టినట్లు గుర్తించామని చెబుతున్నారు.

గ్రామంలోని తమ కుటుంబానికి వేరే ఫ్యామిలీతో భూవివాదం నడుస్తోందని అంకిత్​ సోదరి రాఖీ త్యాగి.. ఐజీ కార్యాలయంలో చెప్పింది. ఆ కుటుంబంతో పోలీసులు కుమ్మక్కయ్యారని.. అందుకే అంకిత్​ను ఇరికించేందుకు పోలీసులు ఇలా చేశారని ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజీని ఐజీకి చూపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం ఐజీ.. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్‌ఎస్పీని ఆదేశించారు.

దెయ్యం కోసం దర్యాప్తు.. ఉద్యోగిని బెదిరించి రూ. 1.4 కోట్లు చోరీ
దెయ్యం దర్యాప్తు కోసం వచ్చి రూ.1.4 కోట్ల దోపిడీ చేసి పరారీలో ఉన్న ఏడుగురు పోలీసులపై ఉత్తర్​ప్రదేశ్​.. వారణాసి కోర్టు నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. ఈ మేరకు జడ్జి శక్తి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేషన్ ఇన్​ఛార్జ్​తో పాటు ముగ్గురు ఎస్​ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ఈ ఘటనపై వారణాసి జిల్లా భేలూపుర్ పోలీస్​ స్టేషన్​లో 12 మందిపై కేసు నమోదైంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.