Mayurbhanj Murder: రూ.100 ఇవ్వలేదని కన్నతల్లినే హత్యచేశాడు ఓ యువకుడు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. నిందితుడు సరోజ్ నాయక్‌ను (21) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని షాలందీ నాయక్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మద్యం కొనుగోలు కోసం తన తల్లిని రూ.100 ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో యువకుడు.. తన తల్లిని తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు షాలందీ నాయక్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జాసీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
ఇదీ చదవండి: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. లాలూ ఇంటికి నితీశ్