ETV Bharat / bharat

నిఖిల్​తో పెళ్లైంది.. కానీ చెల్లదు: ఎంపీ నుస్రత్​ - నుస్రత్​ జహాన్​ భర్త ఎవరు

నిఖిల్​ జైన్​తో సంబంధం గురించి కొనసాగుతున్న వివాదంపై మౌనం వీడారు తృణమూల్ కాంగ్రెస్​ నేత నుస్రత్​ జహాన్​. నిఖిల్​తో తనకు టర్కిష్​ చట్టం ప్రకారం వివాహం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనపై పలు ఆరోపణలు చేశారు నుస్రత్​.

nusrat jahan
నుస్రత్ జహాన్
author img

By

Published : Jun 9, 2021, 3:51 PM IST

Updated : Jun 9, 2021, 8:14 PM IST

తన భర్త నిఖిల్ జైన్​తో సంబంధాల విషయంలో తలెత్తిన వివాదంపై నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మౌనం వీడారు. నిఖిల్​తో తనకు టర్కిష్​ చట్టం ప్రకారం వివాహం జరిగిందని, అయితే ఇది భారత్​లో చెల్లదని ఓ ప్రకటనలో తెలిపారు​. కాబట్టి విడాకులు అన్న మాటే ఉండదని అన్నారు.

Marriage with Nikhil Jain is invalid in India says Nusrat Jahan
ఎంపీ నుస్రత్ జహాన్

నుస్రత్ పెళ్లి ఫొటో

ఈ క్రమంలోనే నిఖిల్​ జైన్​పై పలు ఆరోపణలు చేశారు నుస్రత్​. తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను ఆయన​ దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని డబ్బును తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నుస్రత్-నిఖిల్

నిఖిల్ జైన్- నుస్రత్ జహాన్

వివాదం ఏంటి?

ఇటీవల నిఖిల్-నుస్రత్ దంపతులకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపించాయి. నటి గర్భవతి అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరం ఆరు నెలల నుంచి విడిగా ఉంటున్నామని నిఖిల్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో నటుడు, భాజపా నేత యశ్ దాస్​గుప్తాతో నుస్రత్ డేటింగ్​ చేస్తున్నారంటూ పలు కథనాలు వస్తున్నాయి. నిఖిల్ విషయంపై వివరణ ఇచ్చిన నుస్రత్.. దాస్​గుప్తాతో డేటింగ్​పై మాత్రం స్పందించలేదు.

Nusrat Jahan
నిఖిల్​ జైన్- నుస్రత్​ జహాన్​

ఎవరీ నిఖిల్ జైన్?

నిఖిల్ జైన్ ఓ వ్యాపారవేత్త. ఇంగ్లాండ్​లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్​లో మేనేజ్​మెంట్ కోర్సును పూర్తి చేసిన తర్వాత యూకేకు చెందిన ఎంఎన్​సీలో పనిచేశారు. అనంతరం టెక్స్​టైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

Nusrat Jahan
నుస్రత్​ జహాన్​ ప్రకటన

ఇదీ చూడండి: భాజపాలో చేరిన కాంగ్రెస్ కీలక నేత

Last Updated : Jun 9, 2021, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.