శునకంతో పాశవికంగా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. కుక్క కాళ్లను కట్టేసి లైంగిక దాడికి తెగబడ్డాడు. మూగ జంతువు అన్న కనికరం లేకుండా అత్యాచారం చేశాడు. పంజాబ్ లుథియానా జిల్లాలో ఈ అవమానీయ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..
శిమ్లాపురిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం వివాహ వేడుకకు బయటకు వెళుతూ.. తమ జెర్మన్ షేపర్డ్ జాతి ఆడకుక్కను ఇంట్లో వదిలి వెళ్లింది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి కుక్కను బంధించి అత్యాచారం చేశాడు. కుక్క యజమాని మేనల్లుడు.. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అనంతరం పెళ్లి నుంచి తిరిగొచ్చిన తమ వారికి చూపించాడు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుక్క యజమాని.. మూగజీవాల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట పోలీసులు ఘటనను తేలికగా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఆందోళన అనంతరం నిందితున్ని అరెస్ట్ చేశారు. ఘటనకు పాల్పడ్డ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం.. హత్య
బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన ఛత్తీస్‌గఢ్ బెమెతరలో జరిగింది. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ సునీల్ కుమార్ అనే వ్యక్తి.. అరవకుండా బాలిక నోట్లో చున్ని కుక్కి లైంగిక దాడి చేశాడు. దాంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. అనంతరం అదే చున్నితో బాలికకు ఉరి వేశాడు. మృతదేహాన్ని గమనించిన తల్లిదండ్రులు మొదట ఆత్మహత్యగా భావించారు. పోలీసుల విచారణ అనంతరం ఇది హత్యగా తేలింది. విచారణలో ఈ అఘయిత్యానికి పాల్పండింది సునీల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడని, కేసు నమోదు చేసుకొని సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.