ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో 'మినీ పాకిస్థాన్' గ్రామం!

తన గ్రామం పేరు మినీ పాకిస్థాన్​ అని పేర్కొన్న ఓ వ్యక్తిపై మధ్యప్రదేశ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.

mini pakistan, మినీపాకిస్థాన్​ మధ్యప్రదేశ్​
మినీపాకిస్థాన్ వివాదం
author img

By

Published : Jul 2, 2021, 12:07 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తన గ్రామం మినీ పాకిస్థాన్​ అంటూ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశాడు. వైరల్​ అయిన ఈ పోస్ట్​పై స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లా అమిరతి గ్రామానికి చెందిన అఫ్సర్​​ ఖాన్​గా గుర్తించారు. పరారీలో ఉన్న అఫ్సర్​ ఖాన్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒమన్​, సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నిందితుడు ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అఫ్సార్​ చేసిన పోస్ట్​ మత కలహాలకు దారితీసే అవకాశం ఉన్నందున అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : బస్తాల్లో ఇసుక విక్రయం- ప్రభుత్వం యోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.