ETV Bharat / bharat

Malkajgiri Boy Kidnap Case Updates : 'డబ్బులు అందగానే.. బాలుడిని పిచ్చోడిని చేసేద్దాం' - మల్కాజిగిరిలో 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌ అప్‌డేట్స్

Twist in Malkajgiri Boy Kidnap Case : మల్కాజిగిరి బాలుడి అపహరణ వ్యవహారంలో డబ్బు వచ్చాక.. తమను గుర్తుపట్టకుండా బాధిత బాలుడికి ఆపరేషన్‌ చేయించాలని నిందితులు పథకం వేసినట్టు తేలింది. బాలుడి అపహరణ కేసులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగుచూడడంతో పోలీసులు విస్తుపోతున్నారు. అపహరించిన బాలుడిని కడపకు తీసుకువెళ్లి మతిస్థిమితం కోల్పోయే విధంగా ఆపరేషన్‌ చేయించాలని నిందితులు భావించారు. పోలీసులు కిడ్నాప్‌ కేసును ఛేదించడంతో బాలుడు సురక్షితంగా ఇంటికి చేరాడు.

Malkajgiri Boy Kidnap Case Updates
Malkajgiri Boy Kidnap Case Updates
author img

By

Published : Jun 19, 2023, 7:48 AM IST

Updated : Jun 19, 2023, 8:01 AM IST

Malkajgiri Boy Kidnap Case Updates : 'డబ్బులు అందగానే.. బాలుడిని పిచ్చోడిని చేసేద్దాం'

Malkajgiri 14 Years Boy Kidnap Case Updates : మల్కాజిగిరిలో బాలుడి కిడ్నాప్‌ కేసులో నిందితులు పన్నిన వ్యూహం పోలీసులను కంగు తినిపించింది. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. బాలుడిని కిడ్నాప్‌ చేసిన దుండగులు, రూ.2 కోట్లు తమ చేతికి అందాక బాలుడి మదిలోంచి జ్ఞాపకాలు చెరిపేసి.. పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నట్లు తెలిసింది. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొని ఛేదించడంతో నిందితుల వ్యూహం బెడిసికొట్టింది.

14 Years Boy Kidnapping Case in Malkajgiri : హైదరాబాద్‌ మౌలాలీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్‌ 14 ఏళ్ల కుమారుడి అపహరణ వెనక నిందితులు పన్నిన పథకం క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. బాలుడు హర్షవర్ధన్‌ను ఈ నెల 15న క్రికెట్‌ బంతి ఇప్పిస్తామంటూ నిందితులు శివ, రవి మరికొంత మందితో కలిసి అపహరించారు. ఆ తర్వాత బాలుడిని విడిచి పెట్టేందుకు తల్లిదండ్రులను రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు సమన్వయంతో నిందితులను పట్టుకుని బాలుడిని సురక్షితంగా కాపాడారు.

నిందితులు కారులో బాలుడిని 15, 16 తేదీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో తిప్పారు. మిగతా కుట్రను కడప నుంచి అమలు చేసేందుకు 16వ తేదీ ఉదయం ప్రధాన నిందితుడు శివ కడపకు వెళ్లాడు. కడపకు చేరుకున్న శివ బాలుడి తండ్రి రూ.2 కోట్లు ఇవ్వగానే అందరినీ కడపకు రమ్మని సూచించాడు. అక్కడ తనకు తెలిసిన వారి ద్వారా బాలుడికి మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స ద్వారా అతని గత జ్ఞాపకాలు చెరిపేయాలని భావించాడు. బాలుడికి తాము ముందే పరిచయం ఉండటంతో తల్లిదండ్రులకు అప్పగించాక తమ గురించి చెబుతాడని ఈ ఆలోచన చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది.

బాలుడి అపహరణ వ్యవహారం తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. కేసును ఛేదించడంతో నిందితుల పథకం బెడిసికొట్టింది. కడపలో పట్టుబడ్డ శివను లోతుగా ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన శివ.. కొద్ది కాలం క్రితం కుటుంబంతో సహా నగరానికి వచ్చి మౌలాలీలో నివసిస్తున్నాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో నష్టాల పాలయ్యాడు. సోదరుడు రవి, దిలీప్‌, మహిపాల్‌తో కలిసి బాలుడిని అపహరించాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే తమ ఇంటికి సమీపంలో నివసించే స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్‌ కుమారుడు హర్షవర్ధన్‌ను కిడ్నాప్‌ చేశారు. తాము అడిగిన రూ.2 కోట్లు చేతికి అందగానే.. బాలుడికి మతిస్థిమితం కోల్పోయే ఆపరేషన్‌ చేయించాలని భావించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఎట్టకేలకు కిడ్నాపర్లు పోలీసులకు పట్టుబడటం, బాలుడు సురక్షితంగా బయటపడడంతో అటు పోలీసులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి..

Boy kidnaped in ggh: కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే.. ఉన్న బిడ్డ మాయం..

Child Kidnap in Hyderabad: హైదరాబాద్​లో పసికందు కిడ్నాప్.. వీడియో వైరల్

Last Updated : Jun 19, 2023, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.