ETV Bharat / bharat

రాజస్థాన్​పై కాంగ్రెస్​ దృష్టి..  పరిష్కారం లభించేనా? - సచిన్​ పైలట్​

పంజాబ్​లో నెలకొన్న అంతర్గత విబేధాలను పరిష్కరించి.. నేతలందరిని ఏకతాటిపైకి తేవటంలో సఫలమైంది కాంగ్రెస్​ అధిష్ఠానం. ఇప్పుడు రాజస్థాన్​పై దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్​ ఇన్​ఛార్జ్​ కేసీ వేణుగోపాల్​ జైపుర్​ పర్యటనతో ఆ వాదనలకు బలం చేకూరినట్లయింది. ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​, సచిన్​ పైలట్​ వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందా? పంజాబ్​లో జరిగినట్టే సంక్షోభాన్ని పరిష్కరించి పార్టీని బలోపేతం చేయగలదా?

Sachin pilot, Ashok Gahlot
సచిన్​ పైలట్​, అశోక్​ గెహ్లోత్​
author img

By

Published : Jul 24, 2021, 9:26 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​లో అంతర్గత విబేధాలతో పార్టీ రెండుగా చీలిపోతుందనుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ.. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం చూపింది అధిష్ఠానం. సుదీర్ఘంగా చర్చించి అందరిని మెప్పించింది. పంజాబ్​లో లభించిన జోష్​తోనే రాజస్థాన్​ రాజకీయాలపై దృష్టిసారించింది. విబేధాలను రూపుమాపి, పార్టీని బలోపేతం చేసేందుకు నడుబిగించింది. ఈ క్రమంలోనే రాజస్థాన్​ మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్​వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం కేబినెట్​ విస్తరణ ఉండొచ్చని పలువురు నేతలు తెలిపారు.

ఇందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్​ ఇన్​ఛార్జ్​ కేసీ వేణుగోపాల్​ జైపుర్​ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన రాజస్థాన్​ చేరుకున్నారు. ఆయనతో పాటు రాజస్థాన్​ కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి అజయ్​ మాకెన్​ కూడా ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, జిల్లా అధ్యక్షులు సహా ఇతర నియామకాలపై.. ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​, సచిన్​ పైలట్​ వర్గాలతో మాట్లాడి విబేధాలు సద్దుమణిగేలా చేయాలని వేణుగోపాల్​కు కాంగ్రెస్​ హైకమాండ్​ టాస్క్​ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాజస్థాన్​ మంత్రివర్గ విస్తరణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు వేణుగోపాల్​.

"నేను రాజస్థాన్​ వెళ్తున్నా. ఆ రాష్ట్రం నుంచే నేను రాజ్యసభకు వెళ్లాను. మంత్రివర్గ విస్తరణపై నాకు ఏమీ తెలియదు. అధికారిక పనుల కోసమే వెళ్తున్నా."

- కేసీ వేణుగోపాల్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

మంత్రిత్వ శాఖల కేటాయింపు.. కులాలు, మతాల మధ్య సమతూకంగా ఉండేలా చూసేందుకు అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా.. అశోక్​ గెహ్లోత్​, సచిన్​ పైలట్​లతో వేణుగోపాల్​ చర్చలు జరపనున్నారు. త్వరలోనే తుది ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇందుకోసం శనివారం రాత్రికి సీఎంతోపాటు సచిన్​ పైలట్​ జైపుర్​ చేరుకుంటారు. ముఖ్యమంత్రి నివాసంలో నేతలు భేటీ కానున్నారు.

పైలట్​ వర్గం అసహనం..

పంజాబ్​ కాంగ్రెస్​లో మార్పులు జరిగి అంతా సద్దుమణిగింది. అయితే.. రాజస్థాన్​లో కేబినెట్​ విస్తరణలో జాప్యంపై సచిన్​ పైలట్​ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పైలట్​కు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని ఎమ్మల్యేలు కొద్ది రోజుల క్రితం బహిరంగంగానే డిమాండ్​ చేశారు. త్వరలోనే ఆ దిశగా హైకమాండ్​ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పైలట్​ వర్గం తీరుతోనే మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్​వ్యవస్థీకరణపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తొమ్మిది మందికి అవకాశం..

రాజస్థాన్​ కేబినెట్​లో ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 21 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా తొమ్మిది మంది కొత్తవారిని చేర్చుకునే వీలుంది. అయితే.. అందులో 6-7 సీట్లు తన వర్గంలోని ఎమ్మెల్యేలకే ఇవ్వాలని సచిన్​ పైలట్​ డిమాండ్​ చేస్తున్నారు. అయితే.. సచిన్​ డిమాండ్​ను పూర్తి చేయలేమని, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలికిన బీఎస్​పీ ఎమ్మెల్యేకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి అశోక్​ గెహ్లోత్​ తెలిపినట్లు సమాచారం. కేబినెట్​లోకి స్వతంత్ర ఎమ్మెల్యేలు, బీఎస్​పీ ఎమ్మెల్యేలను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.

సంధి సూత్రం..

మరోవైపు.. సైచిన్​ వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు.. కేబినెట్​తో పాటు కార్పొరేషన్​, వివిధ బోర్డు పదవులను ఇచ్చేందుకు అధిష్ఠానం ప్రతిపాదన చేసినట్లు సమాచారం. దాంతో పాటు పైలట్​కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్​ పార్టీ ఓ సంధి సూత్రాన్ని సిద్ధం చేసిందని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్​ మార్పుపై ప్రకటనకు ముందు గెహ్లోత్​ను మరోమారు దిల్లీ పిలిపించి మాట్లాడనున్నారని సమాచారం. అయితే.. ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదీ చూడండి: దిల్లీలో సచిన్‌ పైలట్‌.. వేడెక్కిన రాజకీయం

'కాంగ్రెస్​తోనే సచిన్​.. సమస్యలకు త్వరలోనే పరిష్కారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.